TGSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. పుణ్యక్షేత్రాలకు ఇంటి నుంచి ప్రత్యేక బస్సులు..!

పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పలు డిపోల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ వివిధ డిపోలో నుంచి బస్సులు నడపనుంది. ప్రయాణికులు ఎక్కువగా ఉంటే ఇంటి వద్దకే బస్సులు రానున్నాయి. అందుకే వివిధ కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచే ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సులను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సులు 2026 నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

కార్తీక మాసం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, భక్తుల బృందాలు కలిసి యాత్రకు వెళ్లేందుకు ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే ముందుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి మరో బస్సు లేదా ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో కొంత మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

RTC Bus

అందుకే ఎక్కువ మంది ఉంటే ఇంటి దగ్గరికే బస్సులు పంపించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి భక్తుల బృందాలకు అనుగుణంగా బస్సులను నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. డిమాండ్ పెరిగితే బస్సుల సంఖ్య పెంచుతామని ఆర్టీసీ తెలిపింది. భక్తులు ఒకే యాత్రలో పలు ఆలయాలను సందర్శించేలా ఆర్టీసీ ప్రత్యేక సర్క్యూట్లను రూపొందించింది. కరీంనగర్ సర్క్యూట్ లో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొమురవెల్లి మల్లన్న ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను సందర్శించవచ్చు.

వరంగల్ సర్క్యూట్ లో కాళేశ్వరం, వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం, లక్నవరం వంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. శ్రీశైలం సర్క్యూట్ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంతో పాటు ఉమామహేశ్వరం, సోమశిల, కందూరు, జోగులాంబ గద్వాల క్షేత్రాలను సందర్శించవచ్చు. ఏపీలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశఆరు. అన్నవరం, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి ప్రాంతాలను కలుపుతూ యాత్రా ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రానికి, కర్ణాటకలోని హంపి, మురుడేశ్వర్ పుణ్యక్షేత్రాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌కు సమీపంలోని కీసరగుట్ట, అనంతగిరి హిల్స్, ముచ్చింతల, యాదాద్రి, సోమశిల వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించారు.డా

కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. కరీంనగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కరీంనగర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సుల బుకింగ్, ప్యాకేజీల ధరలు, ప్రయాణ వివరాలు తెలుసుకోవాలనుకునే భక్తులు తమ ప్రాంతానికి సంబంధించిన TGSRTC డివిజన్ అధికారులకు ఫోన్ చేయవచ్చు. లేదా నేరుగా డిపోలకు వెళ్లవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+