TGSRTC: రాష్ట్రంలో 13 హైటెక్ బస్టాండ్లు.. మోడల్ బస్టాండ్లుగా మరో 86..!
తెలంగాణలోని ఆర్టీసీ బస్టాండ్లకు కొత్త కల రానుంది. కార్పొరేట్ లుక్‌లో మోడల్ బస్టాండ్లుగా మార్చనున్నారు. వినోదానికి, షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా 13 హైటెక్ బస్టాండ్లను తీర్చదిద్దనున్నారు. ఎయిర్‌పోర్ట్ స్థాయి సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందించిన ఈ బృహత్తర ప్రాజెక్టుకు ప్రభుత్వం, రవాణా శాఖల నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు లభించినట్లు సమాచారం. అలాగే పలు చోట్లు కొత్త బస్ టెర్మినళ్లు నిర్మించనున్నారు. నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లు మల్టీ-మోడల్ కనెక్టివిటీ ఉండే విధంగా నిర్మించనున్నారు. బస్సు దిగగానే రైల్వే లేదా ఇతర రవాణా సాధనాలను సులభంగా చేరుకునే సదుపాయం ఏర్పాటు చేయనున్నారు.
స్థానిక, ప్రముఖ వ్యాపారులు తమ బిజినెస్ విస్తరణ కోసం వాణిజ్య సముదాయాలు (కమర్షియల్ స్పేస్). ప్రయాణికులు వేచి ఉండే సమయంలో ఆహ్లాదాన్ని పంచే గేమింగ్, ఫుడ్ కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నూతన హైటెక్ బస్టాండ్లలో షాపులు, బిజినెస్ కాంప్లెక్స్‌ల కేటాయింపు కోసం ఆసక్తిగల వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ ప్రకటించింది. నూతన బస్ స్టేషన్లు ఏర్పాటు కానున్న 13 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్ నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాలు ఆధునిక హంగులతో కొత్త కళను సంతరించుకోనున్నాయి. అలాగే రోజుకు 5 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే 86 రద్దీ బస్ స్టేషన్లను గుర్తించి, వాటిని 'మోడల్ బస్ స్టేషన్లు'గా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణికులకు స్పష్టమైన సమాచారం అందించడం, నిరంతర పర్యవేక్షణ, విచారణ విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
ప్రత్యేక స్టేషన్ కంట్రోలర్లు & ఎంక్వైరీ: గుర్తించిన 86 బస్టాండ్లలో ఒక్కో విభాగానికి ప్రత్యేక స్టేషన్ కంట్రోలర్‌ను నియమించారు. ప్రయాణికులు బస్సుల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఎంక్వైరీ కౌంటర్లు, సంప్రదింపుల కోసం కాంటాక్ట్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను సులభంగా ప్లాన్ చేసుకునేలా స్పష్టమైన బస్సు వేళలతో కూడిన నూతన టైమ్‌టేబుల్ బోర్డులను స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications