TGSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బతుకమ్మ, దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు..!
బతుకమ్మ, దసరా పండుగ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం బస్సులలో కరీంనగర్ జోన్ నుంచి 3,533 బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678, హైదరాబాద్ నుంచి 2,155 బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది. వీటితో పాటు మహబూబ్‌నగర్ నుంచి కనీసం 645, మెదక్ నుంచి 255, నల్గొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. అక్టోబర్ 9 నుంచి 26 మధ్య ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండేలా TGSRTC యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. పండగకు ముందు 9, 10 తేదీలు, అలాగే 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ 25, 26 తేదీలలో తిరుగు ప్రయాణంలో కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

కాగా ప్రత్యేక బస్సులో 50 శాతం వరకు అధికంగా ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ఆర్టీసీకి అవకాశం ఉంది. ప్రత్యేక బస్సుల్లో వన్ వేలోనే ట్రాఫిక్ ఉంటుందని.. తిరిగి వస్తున్నప్పుడు ట్రాఫిక్ ఉండదని.. అందుకే డీజిల్ ఖర్చుల కోసం 50 శాతం అదనంగా వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీ బస్టాండ్ నుంచి కరీంనగర్ కు ప్రత్యేక బస్సులు నడిపితే.. జూబ్లీ స్టేషన్ నుంచి ట్రాఫిక్ ఉంటుంది. కానీ.. కరీంనగర్ నుంచి తిరిగి వచ్చే సమయంలో బస్సులో తక్కువగా ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకే 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
