TGSRTC: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. వారికి 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటన..!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పుడు మహిళల కోసం మరో ఆలోచన చేసింది. మహిళలకు ఇచ్చే బస్సు పాసులకు రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఈ రాయితీ గత శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. మహిళా ప్రయాణికులలో సీజన్ టికెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీని ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రస్తుతం వారికి సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లోను అలాగే జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే మెట్రో, రాజధాని, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు మహిళలు టిక్కెట్, నెలవారీ పాస్ కొనుగోలు చేయాలి. అలాంటి వారికోసం ఆర్టీసీ ప్రత్యేక రాయితీ ఇస్తోంది. ఇకపై మెట్రో, డీలక్స్, లగ్జరీ, రాజధాని బస్సులకు సంబంధించి పాసులు తీసుకున్న మహిళలకు రాయితీ ఇవ్వనున్నారు. ఈ బస్సుల్లో నెలవారీ రూట్ పాస్ కోసం 15 రోజులకు చెల్లించే మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే వారికి 50 శాతం రాయితీపై పాసులు పొందవచ్చు. పైగా ఎస్సీ బస్సుల్లో కూడా ప్రయాణం చేయవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్- కరీంనగర్ రూట్ పాస్ ప్రస్తుతం చెల్లిస్తున్న రుసుములో సగం ధరకే ప్రయాణ సదుపాయం అందుబాటులో వచ్చింది.

పాస్ ధరలను మరింత తగ్గించే క్రమంలో టోల్ ప్లాజా చార్జీలను ప్రస్తుతం ఉన్న 25 రోజులకు బదులుగా ఇకపై 20 రోజులకు మాత్రమే లెక్కిస్తున్నారు. దీంతోపాటు సాధారణ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ ఎంపికను అందించేందుకు డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఈ పాస్లు 'ఇ-డీలక్స్' సర్వీసులలో సైతం చెల్లుబాటు అవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ నగరాల్లో నెలవారీ సిటీ పాస్ కలిగిన వారికి ప్రత్యేక ప్రయోజనంగా.. అన్ని కేటగిరీల సిటీ బస్సు సర్వీసులలో ఆదివారాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది.
అయితే గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని పుష్పక్ ఎయిర్పోర్ట్ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు వర్తించదని గుర్తుంచుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కోసం కాంబి టికెట్ ను అందుబాటులో ఉంటుందని వివరించారు. రూ.20 చెల్లిస్తే కాంబి టికెట్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. పల్లెవెలుగు మంత్లీ సీజన్ టికెట్ హోల్డర్స్ ఎక్స్ప్రెస్, ఇ-ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ, అలాగే ఎక్స్ప్రెస్ ఎంఎ్సటీ హోల్డర్లు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని ప్రకటించారు. కాగా 2 నెలల సీజన్ టికెట్ తీసుకునే వారికి అదనంగా 5 రోజుల వ్యాలిడిటీ, 3 నెలల కోసం తీసుకునే వారికి అదనంగా 10 రోజుల వ్యాలిడిటీ ఉండనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications