తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) గృహ కొనుగోలుదారులతో పాటుగా పెట్టుబడిదారులు సులభంగా, వేగంగా, పారదర్శకంగా సేవలు పొందే విధంగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా TG RERA కార్యాలయంలో కియోస్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులు ప్రాథమిక సేవలను నేరుగా కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా పొందగలిగే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ కియోస్క్‌లు చిన్న బ్యాంక్ అవుట్‌లెట్‌ల మాదిరిగా పని చేస్తాయి. వినియోగదారులు ప్రాజెక్ట్ సమాచారం, ఫిర్యాదులు, నమోదు వివరాలు, ఏజెంట్/మధ్యవర్తుల సమాచారం వంటి సేవలను కియోస్క్ ద్వారా పొందగలరరి TG RERA అధికారులు తెలిపారు. ఈ కియోస్క్‌లు ఏర్పాటు ద్వారా దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. అంతేకాకుండా TG RERA మొబైల్ యాప్ ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

TG RERA..QR కోడ్ సాంకేతికతను కూడా ప్రవేశపెట్టనుంది. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేక QR కోడ్ జారీ చేయబడుతుంది, ఇది బయట ప్రతి ఒక్కరిక కనపడేలా ప్రదర్శించబడుతుంది. వినియోగదారులు ఈ QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ డెవలపర్, ప్రమోటర్, అపార్ట్‌మెంట్ల సంఖ్య, అనుమతులు వంటి పూర్తి సమాచారాన్ని తక్షణమే తెలుసుకోవచ్చు. డెవలపర్లు తమ ప్రాజెక్ట్ ప్రమోషన్, అడ్వర్టైజింగ్‌లో QR కోడ్‌ను తప్పనిసరిగా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది.
2017 జులై నుంచి ఇప్పటివరకు 10,043 ప్రాజెక్ట్‌లు TG RERA నమోదు చేసింది. 4,463 మంది స్థిరాస్తి మధ్యవర్తులు, ఏజెంట్లు రిజిస్టర్ అయ్యారు. ఇప్పటివరకు 2,340 ఫిర్యాదులు అందగా, 1,566 ఫిర్యాదులను పరిష్కరించారు. అలాగే, కొందరు డెవలపర్లు డిఫాల్ట్‌లుగా గుర్తింపబడ్డారు, వీరిలో సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్, జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వైవీఆర్ కన్‌స్ట్రక్షన్స్, సత్యనారాయణ మూల, శ్రీఅమేయా కన్‌స్ట్రక్షన్స్, శ్రీనివాస్ కాకర్లలు ఉన్నాయి.
TG RERA ప్రకారం.. 500 చదరపు మీటర్లకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబడే నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లు, 8 లేదా అంతకంటే ఎక్కువ అపార్ట్‌మెంట్లు ఉన్న నిర్మాణాలు TG RERAలో తప్పనిసరిగా నమోదు కావాలి. ఈ కొత్త సాంకేతికతల ద్వారా TG RERA సేవలు సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించవచ్చు. గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు సమాచారం పొందడం సులభం అవుతుంది. అలాగే తెలంగాణ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో నాణ్యతా ప్రమాణాలు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications