Liquor: లిక్కర్ ఆదాయంలో తెలంగాణ టాప్.. అంతగా తాగుతున్నారా..!
దేశంలో మద్యం వాడకం భారీగా పెరుగుతోంది. ఇండియన్ ఆల్కహాల్ బెవరేజెస్(అల్కోబెవ్) ఇండస్ట్రీ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ISWAI) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల రూపంలో ఆల్కహాల్ ఇండస్ట్రీ దేశ ఖజానాకు దాదాపు రూ.4 లక్షల కోట్లు అందించింది. దేశ మొత్తం పన్ను వసూళ్లలో ఇది సుమారు 6.6 శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు. మద్యం అమ్మకాల నుంచి వస్తున్న ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో మద్యం వాటా ఏకంగా 32 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో తమిళనాడు 27 శాతంతో 2వ స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ 25 శాతంతో 3వ స్థానం దక్కించుకుంది. కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వాటా 20 శాతానికి పైగా ఉంది. మైనింగ్ తక్కువగా ఉండటం వల్ల తెలంగాణలో మద్యంపై పన్నుల భారం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రాల సొంత పన్ను ఆదాయంలో మద్యం వాటా సగటున 19.1 శాతంగా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 2లక్షల 40వేల కోట్లుగా ఉన్న ఈ పన్ను ఆదాయం ఇప్పుడు భారీగా పెరిగింది.

2025 నాటికి ఈ పరిశ్రమ మార్కెట్ రూ.6 లక్షల 20వేల కోట్లకు చేరింది. ఇది దేశ నామినల్ జీడీపీలో దాదాపు 1.8 శాతంగా ఉంది. పన్నుల ఆదాయమే కాకుండా, వ్యవసాయ రంగం నుంచి తయారీ, ప్యాకేజింగ్, హోటళ్లు, రెస్టారెంట్ల రంగాల ద్వారా కోట్లాది మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యంపై అతిగా ఆధారపడటం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాల సొంత పన్ను ఆదాయం ప్రధానంగా పెట్రోలియం, స్టాంప్ డ్యూటీ, మైనింగ్ రాయల్టీలు, ఆల్కహాల్‌పైనే ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. లిక్కర్ నుంచి పన్నుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేసులో ఉన్నప్పటికీ.. అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతోంది మాత్రం కర్ణాటకలో అని లెక్కలు వివరిస్తున్నాయి.
రాష్ట్రాల వారీగా మద్యం అమ్మకాలు పరిశీలిస్తే.. కర్ణాటక 6కోట్ల 88 లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు 6కోట్ల 44లక్షల నుంచి 6కోట్ల 47లక్షల కేసులతో రెండో స్థానంలో ఉంది. తెలంగాణ 3కోట్ల 71లక్షల కేసుల మద్యం అమ్మారు. ఆంధ్రప్రదేశ్ లో 3కోట్ల 55లక్షల కేసులు అమ్ముడయ్యాయి. మహారాష్ట్రలో 2కోట్ల 71లక్షల కేసుల మద్యం విక్రయించారు. ఉత్తరప్రదేశ్ లో 2కోట్ల 50లక్షల కేసుల మద్యం విక్రయించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications