వేలానికి వస్తున్న పేదోడి కల..జూన్ 20న నోటిఫికేషన్, రాజీవ్ స్వగృహలో వేలం వివరాలు ఇవే..

Telangana Rajiv Swagruha Apartments and Plots: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి రాజీవ్‌ స్వగృహ, హౌసింగ్‌ బోర్డుకు చెందిన ఫ్లాట్లు అమ్మకానికి రానున్నాయి. నిధుల సమీకరణ కోసం రేవంత్ రెడ్డి సర్కారు.. రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు, స్థలాలను బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనిపై ఈ నెల 20న ప్రభుత్వం నుంచి అధకారిక ప్రకటన రానుంది. అసంపూర్తి అపార్ట్‌మెంట్లు, ఖాళీ స్థలాలతో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను వేలం వేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

రాజీవ్ స్వగృహ కింద మొత్తం తెలంగాణలో పలు జిల్లాలో 11 ప్రాంతాల్లో చాలా ఇల్లు పూర్తయ్యాయి. వీటన్నింటిని వేలానికి వేయడం ద్వారా రూ.3,500 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మొత్తాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే యోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు, ఇందిరమ్మ ఇళ్ల పథకంతోపాటు మధ్య తరగతి గృహ నిర్మాణాలకు ఉపయోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Telangana property auction Rajiv Swagruha auction Housing Board Telangana Telangana government property sale real estate auction Telangana government housing auction Telangana development funds Telangana property news public housing sale Telangana revenue generation Telangana Rajiv Swagruha Scheme

రాజీవ్‌ స్వగృహ పరిధిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గాజులరామారం, పోచారం, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో(ఒక్కో టవర్‌లో 100 నుంచి 150 వరకు ఫ్లాట్లు ఉంటాయి)ని ఫ్లాట్లను ఒకేసారి విక్రయించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లో 514, కుర్మల్‌గూడలో 20, చందానగర్‌లో 3, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధి పోతులమడుగులో 111, అమిస్తాపూర్‌లో 45 ఖాళీ ప్లాట్లు ఉన్నాయి.

ఇక మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధి బండ్లగూడలో 159, పోచారంలో 601 పూర్తయిన ఫ్లాట్లు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతోపాటు 3.38 ఎకరాల ఖాళీ స్థలం కూడా వేలానికి రానుంది. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ 4వ ఫేజ్‌లో జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే దారిలో హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్, కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ 7, 9 ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మొత్తం 19 ప్లాట్స్ వేలం వేయనున్నారు. ఇక్కడ గజం ధర రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు అధికారులు ఖరారు చేశారు. దీని కోసం ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

అలాగే నాంపల్లిలోని 1,148 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఖాళీ స్థలాన్ని, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 2,605 చదరపు గజాలను వేలంలో విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టనున్న ఈ విక్రయాల ద్వారా ఎలాంటి వివాదాలు లేని, స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగిన ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని కమిషనర్ గౌతమ్ అభిప్రాయపడ్డారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+