Banking News: బ్యాకింగ్ దిగ్గజానికి బాస్‌గా బ్యాడ్ లోన్స్ ట్రబుల్ షూటర్.. MSMEలకు గుడ్ న్యూస్‌తో ఎంట్రీ..
SBI News: దేశంలోని అధిక శాతం మంది ప్రజల బ్యాంకింగ్ అవసరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుస్తూ వస్తోంది. తన పర్ఫామెన్స్ తో ప్రైవేట్ బ్యాంకులకు సైతం గట్టి పోటీ ఇస్తూ, ఎవరూ అందుకోలేని స్థాయికి చేరింది. ఇప్పటివరకు SBIను ముందుండి నడిపించిన దినేష్ ఖారా ప్రస్థానం ముగిసింది. దీంతో మన తెలుగు వ్యక్తి, తెలంగాణ బిడ్డ, అప్పుల ఊబి నుంచి బ్యాంకును విజయవంతంగా గట్టెక్కించిన చల్ల శ్రీనివాసులు శెట్టి ఆ పగ్గాలను అందుకున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే నిన్న బాధ్యతలు తీసుకున్న అనంతరం తన తొలి ప్రాధాన్యత MSME రంగమేనని శెట్టి ప్రకటించారు. టెక్నాలజీ, మార్కెట్ లింకేజ్, గవర్నెన్స్ పరంగా అవి ఇంకా వెనకబడే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వాటితో కలిసి పనిచేస్తూ ఆ పర్యావరణ వ్యవస్థను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. వారికి అవసరమైన క్రెడిట్ డిమాండ్ ను తీర్చేందుకు సాంప్రదాయ బ్యాలెన్స్ షీట్ పై ఆధారపడటానికి బదులుగా డేటాబేస్ట్, క్యాష్ ఫ్లో బేస్డ్ అసెస్మెంట్ ను ఫాలో కానున్నట్లు వెల్లడించారు.

స్ట్రెస్డ్ అసెట్స్ రిజల్యూషన్ గ్రూప్ (SARG) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా శెట్టి 2020 వరకు విదులు నిర్వర్తించారు. 2018-20 మధ్య SBI బ్యాడ్ లోన్స్ ఆకాశమంత అత్యధికామయ్యాయి. వాటిని గాడిలో పెట్టేందుకు ఆయన ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో స్ట్రాటజీలను అమలు చేసిన అనంతరం 2.23 లక్షల కోట్ల బ్యాడ్ లోన్స్ ను 1.49 కు తీసుకొచ్చారు.
ఒక పక్కన బ్యాడ్ లోన్స్ ను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరో పక్కన సంస్థ వృద్ధి కోసం పాటుపడిన ట్రాక్ రికార్డు శెట్టి సొంతం. బ్యాడ్ లోన్ నిర్వహణ కోసం వినియోగించే ఇన్‌కమ్ రికగ్నిషన్ అండ్ అసెట్ క్లాసిఫికేషన్ (IRAC) నిబంధనలు ఉన్నవి ఉన్నట్లుగా అమలు చేయలేదన్నారు. బదులుగా RBI 2026లో ప్రవేశపెట్టనున్న ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL)తరహా విధానాన్ని ముందుగానే సమర్థవంతంగా వినియోగించినట్లు చెప్పారు. ఇలా బ్యాంకును అప్పుల ఊబి నుంచి బయటపడేసి కొత్త ఆశా కిరణంలా తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు.
దూరదృష్టి, లక్ష్యం దిశగా అలుపెరుగకుండా కష్టపడటం, దయా హృదయం కలగలిపిన వ్యక్తి CS శెట్టి అని ఆయన సహోద్యోగులు చెబుతున్నారు. రుణగ్రహీతల పట్ల ఆయన వ్యవహరించే తీరు ఎన్నోసార్లు ప్రశంసలు అందుకుందని తెలిపారు. సాధారణంగా ఆయన తన క్యాబిన్లో కూర్చోవడం తక్కువ అని, ఇతర ఉద్యోగులతో కలిసి ఫ్లోర్ మీద పనిచేస్తూ, వారికి సమయానుగుణంగా సలహాలిస్తూ ఉంటారని గతంలో ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications