దేశ ఆర్థిక పవర్ హౌస్‌గా తెలంగాణ.. ఇండియాలో ఎక్కువ సంపాదిస్తున్నది ఇక్కడి ప్రజలే..!
తెలుగు రాష్ట్రం తెలంగాణ ఏ విధంగా అభివృద్ధిలో దూసుకుపోతుందో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ ప్రఖ్యాత సిటీలతో పోటీపడుతూ విశ్వనగరంగా వెలుగొందుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణకు ఉన్న ప్రత్యేక స్థానమేంటో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు నివేదించింది.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం, నికర రాష్ట్ర దేశీయోత్పత్తి (NSDP) ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విభాగాలు పేర్కొన్నాయి. ఇవి పార్లమెంటుకు అందించిన సమాచారం మేరకు తెలంగాణను దేశ పవర్ హౌస్ గా చెప్పుకోవచ్చు.

2022-2023లో 3 లక్షల 8 వేల 732ల తలసరి NSDPతో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత కర్ణాటక రూ. 3 లక్షల ఒక వేయి 673 తో కర్ణాటక రెండవ స్థానం ఆక్రమించింది. గత 6 ఏళ్లలో తెలంగాణ తలసరి NSDP గణనీయంగా పెరిగింది. 2017-18లో లక్షా 79 వేల 358 ఉండగా.. రూ. ఏకంగా 72 శాతం వృద్ధి చెందింది. 2014-15తో పోలిస్తే NSDP పెరుగుదల 151 శాతం ఉండటం గమనార్హం.
తెలంగాణ తలసరి ఆదాయమూ భారీగా పెరిగింది. 2014-15లో 1.72 లక్షల నుంచి 2022-23లో 3.12 లక్షలకు వృద్ధి చెందింది. అంటే 81 శాతం అసాధారణ పెరుగుదల నమోదైందన్నమాట. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలను సైతం వెనక్కునెట్టి దూసుకుపోతోంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ స్థాయిలో మద్ధతిస్తున్న తెలంగాణకు కేంద్రం నుంచి పన్నుల రూపంలో అందుతున్నది చాలా తక్కువేనని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ గణాంకాలు కూడా దాదాపు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతే ఐదేళ్లలో కీలక ఆదాయ వనరులపై కేంద్రం పన్నులు పెంచకపోవంతో తెలంగాణకు కేటాయింపులు సైతం స్థిరంగానే ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంటోంది.


Click it and Unblock the Notifications