TOMCOM: ఆ అభ్యర్థులకు ఫీజు రీఫండ్ చేయనున్న టామ్‌కామ్..!
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) జర్మనీ ఆస్బిల్డుంగ్ ప్రోగ్రామ్ అభ్యర్థులు చెల్లించిన మొత్తంలో కొంత తిరిగి చెల్లించేందుకు టామ్‌కామ్ సిద్ధమైంది.ఇందుకు అంగీకరించేవారు ఒక అండర్‌టేకింగ్‌పై సంతకం చేయాలని అధికారులు కోరారు. ఇందుకు సంబంధించి నవంబర్ 16, సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ అండర్‌టేకింగ్ లో వడ్డీ, నష్టాలు లేదా పరిహారం కోసం ఎలాంటి క్లెయిమ్ చేసుకోరాదు. ఇది 2024 మరియు 2025 సంవత్సరాలలో ఫెయిర్స్ట్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి టామ్‌కామ్ నిర్వహించిన మూడు ఆస్బిల్డుంగ్ బ్యాచ్‌లకు వర్తిస్తుంది.
బి1 జర్మన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సుమారు రూ. 1.8 లక్షలు, ఉత్తీర్ణులు కాని వారికి సుమారు రూ. 89,000 ఆఫర్ చేసినట్లు అభ్యర్థులు తెలిపారు. వారు రూ. 4.10 లక్షల ప్రోగ్రామ్ ఫీజు (పార్ట్ 1) కోసం ఒక్కొక్కరు దాదాపు రూ. 2.57 లక్షలు చెల్లించారని, దీనికి అదనంగా గోథే పరీక్ష ఫీజులు, ప్రయాణం, వసతి, రుణ వడ్డీ కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ వాపసు ఫారంలో "అర్హత కలిగిన జర్మన్ భాషా శిక్షణ ఫీజు" అని పేర్కొన్న మొత్తాన్ని మాత్రమే కవర్ చేస్తుందని గుర్తు చేశారు. టామ్‌కామ్ నవంబర్ 13న పంపిన ఈ మెయిళ్లలో జర్మన్ భాషా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, ఇంకా విదేశాలలో ఉద్యోగం సంపాదించని అర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును వాపసు ఇస్తామని అందులో పేర్కొంది.

అయితే ఈ వాపసు ప్రక్రియ రీఫండ్ అండర్‌టేకింగ్ సమర్పించిన తర్వాత మాత్రమే జరుగుతుందని స్పష్టం చేసింది. అభ్యర్థులను బృందాలుగా విభజించి, ప్రతి బృందానికి నవంబర్ 16 నుంచి 20 మధ్య ఒక తేదీని ఇస్తామని ప్రకటించింది. నిర్ణీత తేదీ, సమయానికి మాత్రమే రావాలని పేర్కొంది. సోమవారం ఉదయం ఐటీఐ మల్లేపల్లి క్యాంపస్‌లోని టామ్‌కామ్ కార్యాలయానికి దాదాపు 20 మంది అభ్యర్థులు చేరుకున్నారని ఒక అభ్యర్థి తెలిపారు. ఆ రోజు హాజరు కావాల్సిన వారిని ఒక్కొక్కరిగా ముగ్గురు సభ్యుల కమిటీ ముందు హాజరుపరిచారని, ఈ ప్రక్రియ అంతటా టామ్‌కామ్ జనరల్ మేనేజర్ కె. నాగ భారతి అక్కడే ఉన్నారని అభ్యర్థులు చెప్పారు.
అభ్యర్థుల సమస్యలను పరిష్కరించడానికి తాము ఒక కమిటీని ఏర్పాటు చేశామని, టామ్‌కామ్ అధికారులు కాదని ఉన్నత ప్రభుత్వ అధికారులు చెప్పారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అభ్యర్థి తెలిపారు. అది ఒక ఉన్నత స్థాయి కమిటీలా అనిపించిందని ఓ అభ్యర్థి అన్నారు. కానీ వారు ఎవరితో వ్యవహరిస్తున్నారో అభ్యర్థులకు చెప్పలేదు. వారు రాష్ట్ర సచివాలయం నుంచి వచ్చారేమోనని భావిస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు అంగీకరిస్తే డబ్బు త్వరగా జమ చేస్తామని అధికారులు చెప్పినట్లు వివరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications