AI News: వేగంగా మారుతున్న అంతర్జాతీయ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ను AI గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
ప్రముఖ AI మరియు ఎనలిటిక్స్ సంస్త 3AIతో తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ సహా యావత్ రాష్ట్రాన్ని IT మరియు AI ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా తయారుచేయాలని సంకల్పించింది. AI కమ్యూనిటీ మరియు పర్యావరణ వ్యవస్థను స్థాపించడానికి, మెరుగుపరచడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్(ITE&C) డిపార్ట్‌మెంట్ మరియు 3AI ఈ MoU ద్వారా కలిసి పనిచేయనున్నాయి.

వివిధ ఎంటర్‌ప్రైజెస్, టెక్-సర్వీస్ సంస్థలు, స్థానిక స్టార్టప్‌లను ప్రభుత్వం ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేయనుంది. AI ఆవిష్కరణ మరియు పురోగతికి సంబంధించి లీడర్‌షిప్ రౌండ్‌టేబుల్ సమావేశాలు, ఈవెంట్‌లను నిర్వహించడం సహా హోస్ట్ చేసేందుకు ఈ MoU అవకాశం కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా 3AI తన ఫోరమ్‌లను కూడా విస్తరించిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ITE&C అధికారులు మరియు 3AI CEO సమీర్ ధనరజనీ సమక్షంలో MOUపై సంతకాలు జరిగాయి. 'Gen AI అడాప్షన్ కోసం అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ & ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టించడం మరియు ప్రారంభించడం: వ్యూహాత్మక దృక్పథాలు' అనే అంశంపై లీడర్‌షిప్ రౌండ్‌టేబుల్ కూడా ఈ MoUలో ఉంది. ఇందులో AI అవసరాలు, స్వీకరణ, సంబంధిత ఆవిష్కరణల పరిష్కరానికి తెలంగాణ చేపట్టిన కీలక కార్యక్రమాల గురించి చర్చించారు.
కాగా ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం 1500 కోట్లు వెచ్చించి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల టాటా గ్రుప్ కూడా ప్రకటించింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణను AI వంటి సాంకేతికల్లో ప్రపంచానికే తలమానికంగా మార్చాలని సర్కారు యోచిస్తోంది.


Click it and Unblock the Notifications