Global AI Summit: ఇప్పటి వరకు ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా ప్రపంచ దేశాల కంపెనీలను ఆకట్టుకుంటున్న హైదరాబాద్ నగరాన్ని ఏఐ సాంకేతికతకు సైతం డెస్టినేషన్ గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సెప్టెంబర్ 5,6న హైదారాబాదులో నిర్వహించనున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్ గురించి గుడ్ రిటర్న్స్ వార్తా సంస్థతో ప్రత్యేకంగా తన ఆలోచనలను పంచుకున్నారు.
ప్రస్తుతం టెక్ పెట్టుబడులకు డెస్టినేషన్ గా ఉన్న రాష్ట్రం మారుతున్న సాంకేతికతలను ఎప్పికప్పుడు అందిపుచ్చుకోవాలని చూస్తోందని అందుకే ఏఐ దృష్టి సారించినట్లు మంత్రి చెప్పారు. ఈ సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తోందని, ఈ క్రమంలో ముందస్తుగా కొత్త టెక్నాలజీ మార్పులను అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. న్యూ ఏజ్ ఇన్నోవేటర్స్, ఇన్వెస్టర్లకు అవసరమైన ఇన్ ఫ్రా, టెక్నలాజికల్ ఆర్కిటెక్చర్ అందించేందుకు తెలంగాణ ముందుండి ఏఐ సాంకేతిక అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకోవటం లక్ష్యంగా సమ్మిట్ జరుగుతోందని చెప్పారు.

రానున్న కొద్ది కాలంలో ఏఐ సాంకేతిత వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో పెద్ద మార్పులకు దారితీసి ప్రజలకు ఉపయోగపడనుందని చెప్పారు. సప్లై చైన్ సమస్యలను పరిష్కరించి రైతులకు సహాయపడుతుందని, అలాగే ఏఐ క్లౌడ్ టెక్నాలజీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన డేటాను స్టోర్ చేయటంతో పాటు సమయానుకూలంగా వారికి మందులు, చికిత్సలు అందించేందుకు సహాయపడనుందన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి దోహదపడుతుందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పాఠ్యాంశంగా మారి మార్కెట్లకు అవసరమైన సాంకేతికతలను ముందునుంచే నేర్చుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రోజువారీ జీవితంలో ప్రజలు ఏఐ సాంకేతికతలను ఎంతవరకు ఉపయోగించుకునేందుకు వీలుంటుందనే అంశాలపై సమ్మిట్ లో చర్చించనున్నట్లు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలపై దీని ప్రభావం గురించి ఆలోచిస్తామన్నారు.
ఏఐ సాంకేతికతను విజయవంతంగా వినియోగించేందుకు అవకాశం ఉన్న అన్ని రంగాల్లో ఉపయోగించటంపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే భారతీయ గేమింగ్ రంగం ఏఐ సాంకేతికతను ఫలవంతంగా దశాబ్థకాలంగా ఉపయోగిస్తోందని చెప్పారు. ఇదే క్రమంలో ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ ఇప్పటికే తమ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించిందని చెప్పారు. విమానాశ్రయానికి చేరువలో ఉన్న దీనిని తెలంగాణను గ్లోబల్ ఎకోసిస్టమ్ గా మార్చేందుకు దోహదపడనుందని చెప్పారు. పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు అనువైన రియల్టీ నిర్మాణాలు, టెక్నాలజీ సహకారంతో పాటు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని కంపెనీలను రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వినియోగం వైపు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎయిర్ కండిషనింగ్ వినియోగాన్ని తగ్గించేలా కోరుతున్నట్లు చెప్పారు. అలాగే రాబోతున్న డేటా సెంటర్లు అధికంగా నీరు, పవర్ ఎక్కువగా వినియోగిస్తాయని వాటి వినియోగాన్ని తగ్గించేందుకు నూతన సాంకేతికతలను వినియోగించేలా ప్రోస్సహిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో ఐఐటీ హైదరాబాద్ డ్రైవర్ లెస్ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ప్రస్తుతం భారతదేశంలోని ఇన్ ఫ్రా, ఇతర పరిస్థితులు అందుకు దోహదపడటం లేదన్నారు. అయితే రానున్న 2-3 నెలల్లో ప్రత్యేక రోడ్లలో ఈ సాంకేతికతను ప్రయోగాత్మకంగా టెస్ట్ చేయనున్నట్లు చెప్పారు.
ఐటీ రంగంలో పొరుగుతున్న ఉన్న బెంగళూరు, చెన్నై నగరాల కంటే హైదరాబాద్ తాగు నీరు, మెుబిలిటీ సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ అద్భుత స్థాయిలో ఉందని పేర్కొంది. ఇదే క్రమంలో ఏపీ సీఎం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పిన అంశంపై స్పందిస్తూ తెలంగాణలో పరిశ్రమలకు కేవలం 2 వారాల్లో అనుమతులు అందిస్తున్నట్లు చెప్పారు.
1992లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాకు శంకుస్థాపన జరిగిందని ఐటీ మంత్రి గుర్తుచేశారు. గత దశాబ్దంలో ప్రపంచ డిమాండ్‌లో భారీ పెరుగుదల ఉండగా అన్ని రాష్ట్రాలు తమ వాటాను పొందాయన్నారు. ఈ క్రమంలో కర్ణాటక అత్యధిక వాటాను పొందుతూ రూ.7.5 లక్షల కోట్లు సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎగుమతులు రూ.2.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై స్పందిస్తూ మార్కెటింగ్ ఎక్కువ, ఆచరణ తక్కువగా ఉందని శ్రీధర్ బాబు వెల్లడించారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్‌వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications