బెంగళూరుకు బ్యాడ్ న్యూస్.. వావ్ రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్, అమలులో ఐటీ మంత్రి బిజీబిజీ..

Global Value Centres: ఐటీ సంస్థల ఏర్పాటుకు దక్షిణ భారతంలో కొత్త డెస్టినేషన్ కింద మారిపోయింది హైదరాబాద్. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరు నుంచి పోటీని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచ కంపెనీలను ఆకర్షిస్తూ తెలంగాణ దూసుకుపోతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐటీ పరిశ్రమ విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యతను అందిస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు కొత్తగా గ్లోబల్ వాల్యూ సెంటర్ల ఏర్పాటును ప్రకటించారు. హైదరాబాద్‌ను బ్యాక్-ఆఫీస్ పవర్‌హౌస్ నుంచి ప్రపంచ సాంకేతికత, ఆవిష్కరణల్లో అగ్రగామిగా మార్చేందుకు ఈ చర్య దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు. వాస్తవానికి ఇది ప్రస్తుతం కొనసాగుతున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు అప్‌గ్రేడ్ అని మంత్రి పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా ప్రపంచ సంస్థలకు టెక్నాలజీ, బిజినెస్ ఆపరేషన్స్‌కి సేవలను జీసీసీల ఏర్పాటుతో హైదరాబాద్ సేవలను అందిస్తోంది. ‌

Telangana IT Minister reveals Global Value Centres plan to make hyderabad a power house of tech growth

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా తెలంగాణ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల నుంచి గ్లోబల్ వాల్యూ సెటర్లకు మారుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది కేవలం అప్‌గ్రేడ్ మాత్రమే కాదని, ఒక టెక్టోనిక్ మార్పుగా మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవలం సర్వీస్ డెలివరీని దాటి ఆవిష్కరణల్లో అగ్రగామిగా మారేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టినట్లు శ్రీధర్ బాబు చెప్పారు. దీని ద్వారా రానున్న కాలంలో హైదరాబాద్ ప్రపంచ సాంకేతిక చక్రంలో సాంకేతిక పరివర్తనకు కేంద్రంగా మారుతుందని స్పష్టం చేశారు.

అధికారిక డేటా ప్రకారం ఇప్పటికే హైదరాబాద్ 1500 ప్రపంచ టెక్ సంస్థలకు నిలయంగా ఉందని వెల్లడైంది. దీని ద్వారా 15 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్, 3 లక్షల మంది ఏఐ ఇంజనీర్లు ఉపాధిని పొందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ ప్రపంచంలోని టాప్-5 అవుట్‌సోర్సింగ్ గమ్యస్థానాల్లో ఒకటిగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న GCC హబ్‌గా కొనసాగుతోందని తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది.

మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. తెలంగాణ AI-ఆధారిత పాలన, సెమీకండక్టర్ పురోగతి, డీప్-టెక్ నైపుణ్యాలపై దృష్టి సారించటం ద్వారా టెక్ పరిశ్రమలో వృద్ధికి మరో కొత్త అడుగు వేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. తెలంగాణ గ్లోబల్ వాల్యూ సెంటర్ల వైపు మళ్లటంతో రానున్న కాలంలో హైదరాబాద్ బ్యాక్ ఆఫీసు కార్యకలాపాలకు కేంద్ర బిందువు స్థాయి నుంచి ఆవిష్కరణలకు కేంద్రంగా మారబోతుందని ఐటీ మంత్రి వెల్లడించారు. ఇదే జరిగితే బెంగళూరు కంటే ఎక్కువ ఉద్యోగాల కల్పన తెలంగాణలోని హైదరాబాదులో జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+