గచ్చిబౌలిలో రూ. 26 లక్షలకే ఫ్లాట్.. లక్కు ఉంటే లాటరీలో మీకే తగిలే ఛాన్స్.. షరతులు వర్తిస్తాయి..

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో సొంత ఇల్లు కలిగి ఉండాలని అనేక మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలు కోరుకుంటాయి. అయితే భూమి ధరలు, ఫ్లాట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆ కల చాలామందికి దూరమవుతోంది. అయితే ఇప్పుడు ఆ కలను సాకారం చేసే దిశగా తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) కీలక ముందడుగు వేసింది. తక్కువ ఆదాయ వర్గాల (LIG) ప్రజల కోసం గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం నగరాల్లో మొత్తం 339 ఫ్లాట్లను విక్రయానికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పథకంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో కేవలం రూ.26.4 లక్షల ప్రారంభ ధరకు ఫ్లాట్ అందుబాటులో ఉండటమే. ఐటీ కంపెనీలు, కార్పొరేట్ ఆఫీసులు, మెట్రో కనెక్టివిటీ, కీలక రహదారులకు దగ్గరగా ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో ఈ ధరకు ఇల్లు దొరకడం నిజంగా మధ్యతరగతి వారికి అరుదైన అవకాశంగా భావిస్తున్నారు.

Gachibowli LIG plot Telangana Housing Board LIG LIG plot price Gachibowli affordable housing Telangana Housing Board plot scheme LIG housing scheme Hyderabad Gachibowli property news low income group housing Telangana Housing Board guidelines LIG plot sale restriction 5 year lock in LIG plots housing board plots Hyderabad Gachibowli real estate affordable plots Hyderabad THB LIG scheme 5 -

తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ మరియు కమిషనర్ వి.పి. గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకం కింద Gachibowli AIG హాస్పిటల్స్ సమీపంలో 111 ఫ్లాట్లు, వరంగల్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో రాంకీ ఎన్‌క్లేవ్‌లో 102 ఫ్లాట్లు, అలాగే ఖమ్మం శ్రీరామ్ హిల్స్‌లో 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టులలోని ఫ్లాట్లన్నీ గేటెడ్ కమ్యూనిటీలలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం 450 నుంచి 650 చదరపు అడుగుల మధ్య ఉండగా, ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల్లో నివాసం ఉన్నందున, మౌలిక సదుపాయాలు, భద్రత, రహదారి కనెక్టివిటీ వంటి అంశాల్లో కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన గృహ వసతి కల్పించడమే హౌసింగ్ బోర్డు ప్రధాన లక్ష్యం. అందుకే నగరాల ముఖ్య ప్రాంతాల్లో ఉన్న ఈ ఫ్లాట్లను సరసమైన ధరలకు కేటాయిస్తున్నామని గౌతమ్ తెలిపారు. రూల్స్ విషయానికి వస్తే.. ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. అర్హత కలిగిన వారు రూ.1 లక్ష ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) చెల్లించి.. తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని మీ-సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

గచ్చిబౌలిలో ఫ్లాట్‌ల ధరలు రూ. 26 లక్షల నుంచి రూ. 36.20 లక్షల వరకు ఉండగా, వరంగల్‌లో రూ. 19 లక్షల నుంచి రూ. 21.50 లక్షల మధ్య, ఖమ్మంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ. 11.25 లక్షలుగా నిర్ణయించారు. లక్కీ డ్రాలో ఫ్లాట్ దక్కినట్లయితే, మొత్తం ధరను మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించనున్నారు. లక్కీ డ్రాలో ఫ్లాట్ దక్కని దరఖాస్తుదారులకు, చెల్లించిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌ను అసలు చెల్లింపు మార్గం ద్వారానే తిరిగి చెల్లిస్తారు.

బ్యాంకు రుణాలు పొందదలచిన వారికి సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అనుమతితో NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ అనంతరం సేల్ డీడ్‌ను TGHB నేరుగా బ్యాంకుకు పంపుతుంది. అయితే, దరఖాస్తుదారుడు ఫ్లాట్ కేటాయింపుకు దరఖాస్తు చేస్తున్న పట్టణంలో తన పేరు మీద గానీ, జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల పేర్లపై గానీ ఎలాంటి ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ కలిగి ఉండకూడదు. అలాగే, ఒకసారి కేటాయించిన ఫ్లాట్‌ను ఐదు సంవత్సరాల వరకు ఎవరికి బదిలీ చేయలేరు.

షెడ్యూల్ ప్రకారం గచ్చిబౌలి ఫ్లాట్లకు జనవరి 6న, వరంగల్ ఫ్లాట్లకు జనవరి 8న, అలాగే ఖమ్మం ఫ్లాట్లకు జనవరి 10న లాటరీ నిర్వహించనున్నారు. అయితే, ఈ పథకంలో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఫ్లాట్ కేటాయింపు పొందిన వారు కనీసం ఐదేళ్ల పాటు ఆ ఫ్లాట్‌ను ఇతరులకు అమ్మడానికి లేదా లీజుకు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ ఐదు సంవత్సరాల లాక్-ఇన్‌ పీరియడ్‌ హౌసింగ్‌ బోర్డు పథకంలో కీలక అంశంగా ఉంది. ఈ నిబంధన ద్వారా స్పెక్యులేషన్‌ను నివారించి, నిజంగా నివాస అవసరాల కోసం ఇల్లు కోరుకునే వారికి మాత్రమే ప్రయోజనం చేకూర్చాలన్నది హౌసింగ్ బోర్డు ఉద్దేశంగా తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+