జూన్ నెలలో దేశంలోనే అతితక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. దేశవ్యాప్తంగా గత నెలలో సగటున 2.10% నమోదుకాగా, తెలంగాణలో -0.93% నమోదైంది.కేంద్ర గణాంక & కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన రాష్ట్రాల వారీ CPI డేటా ప్రకారం.. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో -1.54%, పట్టణ ప్రాంతాల్లో -0.45% మేర నమోదైనట్లు వెల్లడైంది. అత్యధిక ద్రవ్యోల్బణంలో కేరళ(6.71%), పంజాబ్(4.67%), ఉత్తరాఖండ్(3.40%) తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో నమోదైన లెక్కల వ్యత్యాసం రాష్ట్రవ్యాప్తంగా జీవన వ్యయం ఒత్తిడి తగ్గుతోందని సూచిస్తోంది.ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం ద్రవ్యోల్బణం 0.0% వద్ద ఫ్లాట్ గా ఉంది. గ్రామీణ -0.55%, పట్టణ 1.06% గా నమోదైంది.
2020-23 మధ్య BRS పాలనలో తెలంగాణ డబుల్-డిజిట్ ద్రవ్యోల్బణ దశలను ఎదుర్కొన్నట్లు స్థానిక రిపోర్టులు గుర్తుచేస్తున్నాయి. అదే సమయంలో జీవన వ్యయం భారం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ద్రవ్యోల్బణం వరుసగా పడిపోతూ వచ్చింది. ఫిబ్రవరి 2025లో 1.31%, మార్చిలో 1.06%, ఏప్రిల్‌లో 1.26% (కాస్త రీబౌండ్), మేలో 0.55%, చివరికి జూన్‌లో -0.93%గా నమోదవుతూ వచ్చింది. ఈ ఐదు నెలల ట్రెండ్ ధరల వేగం మెల్లగా క్షీణించి చివరికి మైనస్‌లోకి వెళ్ళింది.

ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు సమయానుగుణంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణంగా పిలుస్తారు. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగితే.. వస్తువులు, సేవల ధరలు పెరుగుతాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఒక పరిధివరకూ తగ్గితే ధరలు తగ్గుతాయి. అదే ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళితే అది డీఫ్లేషన్ స్టేట్ (ప్రతి ద్రవ్యోల్బణ దశ)లోకి జారినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అమలు చేస్తున్న ప్రజా హిత పథకాలు కుటుంబాల ఖర్చు భారాన్ని తగ్గించాయని ప్రభుత్వం వాదిస్తోంది.
ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (TSRTC), ఎల్పీజీ సిలిండర్ రూ. 500కు సబ్సిడీ, గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లు ఉచితం, రాజీవ్ ఆరొగ్యశ్రీ కింద రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రేషన్ కార్డు దారులకు ఉచిత ఫైన్ రైస్ (దశల వారీగా) ఈ సబ్సిడీలన్నీ సామాన్యుల జేబులో ఖర్చు తగ్గించి వినియోగదారుల దినసరి బడ్జెట్లను తేలిక చేసే దిశగా పనిచేశాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆర్థికవేత్తలు మాత్రం ధరల తగ్గుదలలో ఇతర అంశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆహార ధరలు క్లిష్టంగా తగ్గడం, విద్యుత్ టారిఫ్‌ల నియంత్రణ, విస్తృత ధాన్య సరఫరా, సంక్షేమ పథక ప్రభావం ఉన్నప్పటికీ ఇది ఒంటరి కథ కాకపోవచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.
తాత్కాలికంగా ధరలు తగ్గడం వినియోగదారులకు ఉపశమనం. కానీ దీర్ఘకాల డిఫ్లేషన్ డిమాండ్ బలహీనత, పెట్టుబడుల ఆలస్యం, ఉత్పత్తి స్లోడౌన్‌లకు దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు లభ్యమైన డేటా ప్రకారం తెలంగాణలోని పరిస్థితిని పరిశీలిస్తే.. సంపూర్ణ ఆర్థిక మాంద్యం సంకేతాలు ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. అయితే తదుపరి నెలలు కీలకం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డీఫ్లేషన్ స్టేట్‌లోకి వెళ్లిందంటే అది ఆ రాష్ట్ర ఆదాయంపై మరింత తీవ్రమైన ప్రభావం చూపించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కొనుగోలు శక్తి క్షీణించడంతో వస్తు, సేవలను ప్రజలు తక్కువగా వినియోగించుకోవడంతో జీఎస్టీ వంటి పన్నుల వసూళ్లు మరింత గణనీయంగా తగ్గుతాయి. ఇది ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications