microfinance: చిన్న మొత్తంలో రుణాల కోసం ప్రజలు ఎక్కువగా మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇవి RBI వద్ద రిజిస్టర్ కాబడిన చట్టబద్ధ సంస్థలు. కానీ అనధికారికంగా ఆయా సంస్థల ఏజెంట్లు.. రుణగ్రహీతల నుంచి అధిక వడ్డీల వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు గతంలో పెద్దఎత్తున వినిపించాయి. వీటిని కట్టడి చేసేందుకు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు సొంత చట్టాలను తీసుకొచ్చాయి. అవి చెల్లవు అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

సొంత చట్టాలు పనికిరావు:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ కాబడిన మైక్రోఫైనాన్స్ సంస్థలను (MFI) రాష్ట్రాలు నియంత్రించలేవని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ అధికారం కేంద్ర బ్యాంకుకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రాలు సొంత మనీ-లెండింగ్ చట్టాలను అమలు చేయడం వల్ల MFIల మీద ఎటువంటి ప్రభావం ఉండదని ఫిబ్రవరి 14న ప్రకటించింది.

అప్పట్లో తీవ్ర వివాదాస్పదం:
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మనీ లెండింగ్ చట్టాన్ని సవాలు చేస్తూ 2010లో మైక్రో ఫైనాన్స్ పరిశ్రమ లాబీ MFIN కోర్టులో కేసు వేసింది. 12 ఏళ్ల అనంతరం ఇప్పుడు దానిపై తుది తీర్పు వెలువడింది. అప్పట్లో ఈ చట్టం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పరిశ్రమ వ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. అనేక సూక్ష్మ, చిన్న రుణ సంస్థల మూసివేతకు ఇది కారణమైంది. చివరకు NBFC-MFIలకు సంబంధించి RBI పలు నిబంధనలు సవరించాల్సిన అవసరం ఏర్పడింది.

సుప్రీం సైతం సమర్థించింది:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ చట్టం 2011.. RBI వద్ద రిజిస్టరు కాబడిన NBFC, MFIలకు వర్తించదని న్యాయస్థానం స్పష్టం చేసింంది. కాగా.. ఈ తరహా తీర్పు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కేరళ, గుజరాత్ ప్రభుత్వాలు సైతం ఇదే విధంగా చట్టాలు తీసుకువచ్చాయి. వాటిపై గతేడాది మే లో సుప్రీంకోర్టు సైతం ఇలాగే స్పందించింది.


Click it and Unblock the Notifications