హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు సేవలను మరింత విస్తరించడానికి, రెండో దశ, మూడో దశ పనులకు దారిని సుగమం చేసుకోవడానికి, ఇప్పటికే ఎల్ అండ్ టీ (L&T) నిర్వహిస్తున్న మొదటి దశ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఎల్ అండ్ టీ రెండో దశ పనుల్లో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో దేశంలోనే మొదటి ప్రైవేట్ మెట్రో ప్రాజెక్ట్ అయిన హైదరాబాద్ మెట్రో ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి రాబోతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ అండ్ టీ ప్రతినిధులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమై చర్చలు జరిపారు. ఇందులో ముఖ్యమైన అంశం అప్పులే. ప్రస్తుతం తొలి దశ మెట్రోపై సుమారు రూ.13 వేల కోట్ల అప్పు ఉంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. ఇక ఎల్ అండ్ టీ వాటా విలువ రూ.5,900 కోట్లు. ఇందులో ఒకటోసారి సెటిల్‌మెంట్‌గా రూ.2000 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే తొలి దశ మెట్రో నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ చేతికి వస్తుంది.
రెండో దశ మెట్రో విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరినా, ఎల్ అండ్ టీ అంగీకరించలేదు. దీనికి కారణం ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడమేనని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తొలి దశ మెట్రో నష్టాల్లో నడుస్తోందని, రెండో దశ ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకోవడం తమకు సాధ్యం కాదని ఎల్ అండ్ టీ స్పష్టంగా తెలిపింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో దశలో కూడా ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉంటే బాగుండేదని సూచించినా..ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మేము ఈ రంగం నుంచి తప్పుకుంటున్నాం" అని తేల్చిచెప్పారు.

హైదరాబాద్‌లో జనాభా పెరుగుతుండటంతో నగర విస్తరణతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. ఒకప్పుడు మెట్రో నెట్‌వర్క్ పొడవులో దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 163 కిలోమీటర్ల అదనపు నెట్‌వర్క్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో 2A, 2B పేరుతో కొత్త మార్గాలను కూడా ప్రణాళికలో పెట్టారు. కానీ కేంద్రం నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం జరుగుతోంది.
ఎల్ అండ్ టీ భాగస్వామ్యం లేకుండా రెండో దశ పనులను ప్రభుత్వం స్వయంగా చేపట్టనుంది. తొలి దశ మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా సమన్వయం సులభం అవుతుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం Hyderabad metro విస్తరణను స్వతంత్రంగా నడిపించే అవకాశం ఏర్పడింది. ఇకపై హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్ట్‌గా కొనసాగనుంది. దీని వల్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయని, రెండో దశ పనులు వేగంగా జరగనున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో మెట్రో రైళ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నడుపుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ మాత్రమే మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా అవతరించింది. కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగనున్నందున హైదరాబాద్ మెట్రో కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వం అధీనంలోకి రానుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications