హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్ & టి (L&T) తో చర్చలు కొనసాగిస్తోంది. ఫేజ్-1లో భాగస్వామిగా ఉన్న L&T ప్రస్తుత నెట్‌వర్క్‌తో ఫేజ్-2ని అనుసంధానించడంలో సమస్యలు విన్నవించడంతో.. రేవంత్ రెడ్డి సర్కారు ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ప్రణాళికలను రూపొందించింది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, L&T Hyderabad Metro ఫేజ్-1లోని వాటాను మార్చడంలో సమస్యలు చూపిస్తూ, రూ.7,000 కోట్ల పెట్టుబడి, రూ.13 వేల కోట్ల రుణాన్ని ప్రస్తావిస్తూ ఫేజ్-1 ప్రాజెక్టు నుంచి తప్పుకుంటుందనే వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఈ డిమాండ్‌ను పూర్తిగా తిరస్కరించారు. దీనికి బదులుగా ప్రభుత్వం రెండు ఆప్షన్లను L&T ముందు పెట్టినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-1ని రూ. 15 వేల కోట్లుగా అంచనా వేసి, L&Tకు రెండు ఎంపికలను ఇచ్చింది. అత్యధిక ప్రైవేట్ బిడ్‌తో వాటాను విక్రయించడం లేదా రూ. 2,000 కోట్ల చెల్లింపు ద్వారా రూ. 13 వేల కోట్ల రుణాన్ని బదిలీ చేయడం. ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపిన తర్వాత, నెట్‌వర్క్ ఏకీకరణ కోసం L&T తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయమని రాష్ట్రం కోరింది.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, మూడు కారిడార్లలో 69 కి.మీ.ల మేర విస్తరించి ఉండగా.. L&T కీలక వాటాదారు, ఆపరేటర్‌గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-2లో రూ. 24 వేల కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ వెంచర్‌గా మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. ఫేజ్-2 విస్తరణ 76.4 కి.మీ.లలో ఐదు కొత్త కారిడార్లను కవర్ చేయనుంది.
ఫేజ్-1లో L&T రూ.7 వేల కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇది సంవత్సరానికి సుమారుగా రూ.600 కోట్లు. ప్రస్తుతం, ఫేజ్-1లో రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఫేజ్-2 విస్తరణతో ఈ సంఖ్య 15 లక్షలకు పెరుగుతుందనిఅంచనా. ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల L&T నష్టాలను కూడా తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మూడు రెట్లు ప్రయాణికులు పెరిగితే, ప్రస్తుతం సంవత్సరానికి ఉన్న రూ. 600 కోట్ల నష్టాలను తొలగించవచ్చని అంచనా.
ఇక L&T నష్టాలకు ప్రధాన కారణాలు కూడా గుర్తించారు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో గత ప్రభుత్వం రూ.3 వేల కోట్ల సాఫ్ట్ లోన్‌ను విడుదల చేయడంలో విఫలమైందని తెలుస్తోంది. కేవలం రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చింది. అదనంగా, వాణిజ్య ఉపయోగం కోసం కేటాయించిన 200 ఎకరాల భూమిని L&T సమర్థవంతంగా ఉపయోగించడంలో విఫలమయ్యింది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్-2 కోసం కేంద్రం నుండి 4 శాతం వడ్డీ రేటుతో సావరిన్ గ్యారెంటీ రుణం పొందడానికి యోచిస్తోంది. దీని ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. విస్తరణ తర్వాత, మెట్రో ఆదాయం రోజుకు సుమారు రూ.10 కోట్లకు చేరుతుందని, రుణం చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు తరువాత రోజువారీ లాభం రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా ఫేజ్-2 విస్తరణ.. ప్రయాణికుల సంఖ్య పెరగడం, నష్టాలు తగ్గించడం, స్థిరమైన లాభాలను సాధించడం వంటి ప్రధాన ప్రయోజనాలను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వం, L&T మధ్య చర్చలు విజయవంతమతే.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ నియమితులైన తర్వాత తొలిసారిగా మెట్రో రైల్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్రో ప్రాజెక్టు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఫేజ్-1 ప్రాజెక్టు పనులు, ప్రస్తుత స్థితి, సవాళ్లు మొదలైన అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు.
సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ విస్తరణ పనుల ప్రగతి పరిస్థితిని పరిశీలించారు. పనులు వేగవంతం అయ్యేలా, సమస్యలను అధిగమించడానికి సంబంధిత శాఖలతో సమన్వయం సాధించాలని అధికారులకు సూచించారు. అలాగే ఫేజ్-2ఏ, ఫేజ్-2బీ విస్తరణల తాజా స్థితి గురించి కూడా అధికారుల నుండి వివరాలు సేకరించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications