Rythu Bharosa: తెలంగాణ రైతులకు 2025 మంచి శుభ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా సాయం సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నేడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. తెలంగాణలో సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఈ కార్యక్రమం కింద సాయం అందేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితులను తొలగించాలని నేడు కమిటీ అభిప్రాయపడింది. సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూముల సర్వే చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం దరఖాస్తులను జనవరి 5 నుంచి 7 వరకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వీటి చెల్లింపులు సంక్రాంతి తర్వాతి నుంచి ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే ఇప్పటికైతే దీనికి సంబంధించిన స్పష్టమైన తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉండవచ్చని తెలుస్తోంది..!
* ఆన్‌లైన్ దరఖాస్తు: రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్‌సైట్ లేదా యాప్‌ను ప్రారంభించవచ్చని సమాచారం.
* ఆఫ్‌లైన్ దరఖాస్తు: ఆన్‌లైన్ సౌకర్యం లేని రైతుల కోసం, మండల లేదా గ్రామ స్థాయిలో ఆఫ్‌లైన్ దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చని అందరూ భావిస్తున్నారు.
* కావాల్సిన పత్రాలు: దరఖాస్తు సమయంలో రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర సంబంధిత పత్రాలను సమర్పించాల్సి రావచ్చు.
దరఖాస్తు చేయడానికి అర్హతలు ఏమిటి?
రైతు భరోసా పథకానికి అర్హతలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. సాధారణంగా ఈ క్రింది అర్హతలు ఉండవచ్చు:
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి.
- పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలి.
- వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.
దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి?
అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత.. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్ లింక్, యాప్ వివరాలు, ఆఫ్‌లైన్ కేంద్రాల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పటికీ జనవరి 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ గురించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. కాబట్టి, రైతులు ప్రభుత్వం అధికారిక ప్రకటన కోసం వేచి ఉండటంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవటం ద్వారా వేగంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనికింద ప్రభుత్వం అందించే డబ్బు నేరుగా ఎలాంటి దళారులూ లేకుండానే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది. రైతులు దీనిని వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ, అధిక దిగుబడి సాధించేందుకు ప్రయత్నించాలి.


Click it and Unblock the Notifications