Gas Cylinder: రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అమలుపై తెలంగాణ సర్కార్ కసరత్తు..
తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీతో అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారెంటీలో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే అర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.2500 ఇవ్వాల్సి ఉంది. రూ.500 సిలిండర్ అమలుపై కసరత్తు కొనసాగుతోంది. పౌరసరఫరాల శాఖ ఇందకు కసరత్తు చేస్తోంది.
ఆ శాఖ రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదటి ప్రతిపాదన ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారితో పాటు.. లేని వారిలో కూడా అర్హులను గుర్తించే ప్రతిపాదన కాగా.. రెండోది రేషన్ కార్డుతో అవసరం లేకుండా అర్హులందరికీ ఈ పథకాన్ని అములు చేయడం. అయితే రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అమలు చేయాలని డిమాండ్. అయితే గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలా మంది అర్హులు ఈ పథకం కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఇందులో ఇండియన్ గ్యాస్ 47,96,302 కనెక్షన్లు, హెచ్ పీ 43,39,354 కనెక్షన్లు ఉండా భారత్ పెట్రోలియం కనెక్షన్లు 29,04,338 ఉన్నాయి. ఇక 44 శాతం మంది నెల కాగానే రీఫిల్ చేస్తున్నారు. అయితే కొంత మంది డొమెస్టిక్ గ్యాస్ లిండర్లను కమర్షియల్ కూడా ఉపయోగిస్తున్నారు. దానిపై అధికారులు దృష్టి పెట్టడం లేదు.
ఇక రాష్ట్రంలో 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కేంద్రం సాధారణ గ్యాస్ కనెక్షలకు రూ.40 రాయితీ ఇస్తుండగా.. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లకు రూ.340 రాయితీ ఇస్తోంది. తెలంగాణలో 11 లక్షలకు పైగా ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. 78 లక్షల కనెక్షన్లకు రాష్ట్రం రూ.500 సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 11 లక్షల కనెక్షన్లకు రూ.165 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథం అమలు వల్ల ఖజానా నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది.


Click it and Unblock the Notifications