Crop Loan Waiver: రైతు రుణ మాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే..!

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీ ప్రక్రియ పూర్తి చేసింది. గురువారం రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేసింది. దీంతో రైతు రుణ మాఫీ పూర్తయింది. అయితే రైతు రుణ మాఫీ నిధుల కోసం ప్రభుత్వం భారీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పులు తీసుకొచ్చి రైతులకు రుణ మాఫీ చేసింది. మొత్తం మూడు విడతల్లో రుణ మాఫీ చేసింది. మొదటి దఫాలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసింది. రెండో విడతలో రూ.1.50 లక్షల లోప ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది.

గురువారం మూడో దఫాలో రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు. దేశంలో ఏక కాలం రూ.2 లక్షల రుణ మాఫీ చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పేర్కొంటోంది. అయితే రుణ మాఫీ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చూద్దాం. మొదటి విడతలో 11,34,421 మంది రైతులకు రూ.6034.96 కోట్లు విడుదల చేశారు. రెండో దఫాలో లక్షన్నర లోపు రుణాలు కలిగిన 6,40,223 మంది రైతులకు రూ. 6190.01 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Telangana government has spent huge amount of money for farmer loan waiver

మూడో విడతలో మొత్తం 14.4 లక్షల మంది రైతులకు ఎన్ని విడుదల చేశారో శుక్రవారం తెలియనుంది. రెండు దఫాల్లో 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు జమ చేశారు. జులై 18న తొలి విడత రుణమాఫీ చేయగా.. జులై 30 రెండో దఫా రుణ మాఫీ చేశారు. మొదటగా.. 42 లక్షల మంది అన్నదాతలకు రుణాలు మాఫీ చేయాలంటే.. రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.

మూడో విడతలో మరో 6 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేసినట్లు తెలుస్తోంది. ఇందు కోసం రూ.6,000 కోట్లకుపైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. మూడో విడతకు సంబంధించి శుక్రవారం పూర్తి సమాచారం తెలియనుంది. రైతుల ఖాతాల్లో శుక్రవారం డబ్బులను జమ చేయనున్నారు. రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు, రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలు, సాంకేతిక సమస్యలతో రుణ మాఫీ చేయని అర్హులైన రైతులకు రుణ మాఫీ ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+