తెలంగాణ రైల్వే కనెక్టివిటీకి భారీ బూస్ట్.. రూ. 40 వేల కోట్ల మెగా రైల్వే ప్రాజెక్టులు లైన్లో..

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు అత్యంత వేగంగా పురోగమిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 40,769 కోట్ల అంచనా వ్యయంతో 21 కీలక రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో సాగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. వీటిలో 6 కొత్త రైల్వే లైన్లు, 15 ట్రాక్ డబ్లింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 2,347 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులకు సంబంధించి.. గత మార్చి నాటికి 677 కిలోమీటర్ల మార్గాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనికోసం ఇప్పటివరకు రూ. 12,105 కోట్లు ఖర్చు చేశామని అశ్విని వైష్ణవ్ వివరించారు.

ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులలో.. భద్రాచలం మీదుగా మల్కన్‌గిరి నుండి పాండురంగపురం వరకు నిర్మించే 174 కిలోమీటర్ల కొత్త లైన్ (అంచనా వ్యయం రూ. 3,592 కోట్లు), సికింద్రాబాద్ నుండి వాడి వరకు నిర్మించనున్న 3వ మరియు 4వ రైల్వే లైన్లు (అంచనా వ్యయం రూ. 5,000 కోట్లకు పైగా), అలాగే మునీరాబాద్ నుండి మహబూబ్‌నగర్ వరకు నిర్మించనున్న కొత్త లైన్ (అంచనా వ్యయం రూ. 4,000 కోట్లు) అత్యంత కీలకమైనవిగా ఉన్నాయి. ఇవే కాకుండా రాష్ట్రంలో మొత్తం రూ. 4,883 కోట్ల అంచనా వ్యయంతో 118 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), రోడ్ అండర్ బ్రిడ్జిలను (RUBలు) కేంద్రం మంజూరు చేసింది.

Telangana Railways Railway Projects 40 000 Crore Projects Telangana Infrastructure Indian Railways Rail Connectivity Railway Development Hyderabad South Central Railway Transport Infrastructure Telangana News Railway News Infrastructure Projects Business News India News 40 000

అయితే ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి భూసేకరణ ప్రధాన సవాలుగా మారింది. ప్రాజెక్టులకు అవసరమైన 2,792 హెక్టార్ల భూమిలో ఇప్పటివరకు కేవలం 1,772 హెక్టార్లు (63 శాతం) మాత్రమే సేకరించగా.. మరో 1,020 హెక్టార్ల భూసేకరణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ముఖ్యంగా భూసేకరణ సమస్యల కారణంగానే గుంటూరు-బిబినగర్ డబ్లింగ్, ముద్ఖేడ్-మేడ్చల్, మహబూబ్‌నగర్-ధోన్ డబ్లింగ్ ప్రాజెక్టులు, అలాగే 15 ఆర్‌ఓబీ (ROB) ప్రాజెక్టులు తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Also Read

ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ.. 2014 నుండి 2026 మధ్య కాలంలో తెలంగాణలో 888 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చామని, ఇది ఏటా సగటున 74 కిలోమీటర్ల నిర్మాణ వేగానికి సమానమని కేంద్రం నివేదించింది. మౌలిక వసతులతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవల కాలంలో 21 జతల కొత్త రైలు సర్వీసులను తెలంగాణకు కేటాయించారు. వీటిలో చార్లపల్లి టెర్మినల్ నుండి శాలిమార్, కామాఖ్య, తిరువనంతపురం, ముజఫర్‌పూర్ వంటి నగరాలను అనుసంధానించే 10 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. సరుకు రవాణాను వేగవంతం చేసేందుకు సత్తుపల్లి, సుల్తానాబాద్, తిప్పర్తి, రామగుండం, చిట్యాల్, విష్ణుపురంలలో 6 గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినళ్లను అందుబాటులోకి తీసుకురాగా.. మరో ఎనిమిదింటికి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+