కేటిఆర్ మొత్తం ఆస్తుల విలువ ఇదిగో.. ఒక కారు, వ్యవసాయం ఇంకా అప్పులు..
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌పై బిఆర్ఎస్ నేత కేటి రామారావు తీవ్రంగా విమర్శించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పాలనకి ఏడాది కావోస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని, గుర్తింపును దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిలబెట్టడం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి మహిళల వరకు అన్ని రంగాల్లో కష్టాలను తెచ్చిపెట్టిందని కేటీఆర్ అన్నారు.
అయితే కేటిఆర్ పై కొన్ని న్యూస్ వెబ్ సైట్లో అరెస్ట్ కు సంబంధించి వార్తలు వెలువడ్డాయి. కొద్దిరోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో జరిగిన హింసాకాండకు సంబంధించి పోలీసు కేసులో కేటిఆర్ పేరు రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి లిడార్ కేటి రామారావు సవాలు విసిరారు. "మీకు వీలైతే నన్ను అరెస్ట్ చేయండి! తెలంగాణా రైతులకు అండగా నిలిచినందుకు తల ఎత్తుకొని నేను జైలుకు వెళ్తాను" అని Xలో పోస్ట్ చేసారు.

కేటీఆర్ ఆస్తులు
ఒక నివేదిక ప్రకారం కేటీఆర్ దగ్గర రూ.26.88 లక్షల విలువైన ఇన్నోవా కారు, సంవత్సర ఆదాయం రూ.74.42 లక్షలు అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో రూ.59.85 లక్షలు వ్యవసాయ ఆదాయం ద్వారా వచ్చినట్లు తెలిపారు. రూ.24.65 లక్షలతో వ్యవసాయ ఆదాయం కలిపి రూ.3.79 కోట్ల ఆదాయం అతని భార్య శైలిమకు ఉంది. కేటీఆర్ భార్యకి తనకి ఉన్న కంపెనీలో వాటా ద్వారా రూ.79.65 లక్షల లాభం ఆర్జించింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మాజీ సీఎం కేసీఆర్ కోడలు మొత్తం సంపద విలువ ఆయన కుమారుడి కంటే ఎక్కువే. నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్‌లో కేటీఆర్ తనతో పాటు తన సతీమణి శైలిమకు చెందిన రూ.41 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. కేటీఆర్ ఆస్తుల విలువ రూ.4.94 కోట్లు కాగా, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.36.68 కోట్లు. కేటీఆర్ కు రూ.33.28 లక్షలు, శైలిమకు రూ.27.39 కోట్ల అప్పులు ఉన్నాయి. కేటీఆర్ కూతురు అలేఖ్య బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా రూ.19.59 లక్షలు.
చరాస్తుల విలువ కేటీఆరుకు రూ.3.63 కోట్లు అలాగే శైలిమకి రూ.27.70 కోట్లు. తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శైలిమకు రూ.18 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. హైదరాబాద్, మెదక్, కరీంనగర్ ఇంకా రంగారెడ్డి జిల్లాల్లో ఈ దంపతులకు చెందిన వ్యవసాయం & వ్యవసాయేతర భూముల విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంది. 2016లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా దాఖలైన కేసులో రైల్వే కోర్టు తనను దోషిగా నిర్ధారించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అయితే, ఎలాంటి శిక్ష విధించలేదని కోర్టుకు తెలియజేసారు. తనపై పెండింగ్‌లో ఉన్న 16 క్రిమినల్ కేసులను కూడా ప్రస్తావించారు.


Click it and Unblock the Notifications