ఏసీబీ చరిత్రలోనే బిగ్గెస్ట్ అక్రమాస్తుల రైడ్.. వెంకట రమణ అవినీతి సంపాదన చూస్తే కళ్లుబైర్లు కమ్మాల్సిందే..

తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) చరిత్రలోనే అత్యంత భారీ అక్రమాస్తుల కేసు వెలుగు చూసింది. తెలంగాణ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ (రెడ్కో) డివిజినల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకట రమణ నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లు సహా ఏడు ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించి భారీగా నగదు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల్లో లభించిన అక్రమాస్తుల బహిరంగ మార్కెట్ విలువ ఏకంగా రూ. 150 నుంచి రూ. 200 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఈ సోదాల సమయంలో ఏసీబీ అధికారులు భారీగా స్థిరాస్తులతో పాటు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులను కనుగొన్నారు. సెరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఉన్న నాలుగు నివాస ఫ్లాట్‌లతో పాటు కూకట్‌పల్లి, గుట్టల బేగంపేట్‌లలో ఉన్న రెండు భారీ వాణిజ్య భవనాలను గుర్తించారు. అంతేకాకుండా ఆ అధికారి తన భార్య పేరు మీద నాలుగు నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ప్రస్తుతం ఆంజనేయ నగర్, మూసాపేట్‌లలో సుమారు రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో 10 నివాస అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి.

Telangana ACB Anti-Corruption Bureau Telangana Engineer 150 Crore Assets Disproportionate Assets ACB Raids Corruption Case Telangana News Crime News Business News ACB ACB 150 Disproportionate Assets Telangana News Crime News Business News mutyam venkata ramana

ఈ దాడుల్లో స్థిరాస్తులతో పాటు భారీగా చరాస్తులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 4 కోట్ల విలువైన 2.094 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 52.02 లక్షల బ్యాంకు డిపాజిట్లు, సుమారు రూ. 45 లక్షల విలువైన కియా, మహీంద్రా, మారుతి బలేనో కార్లు, రూ. 30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ లభ్యమయ్యాయి. వీటితో పాటు ఆయన నివాసంలో దాదాపు రూ. 2.5 లక్షల విలువైన 20 మద్యం సీసాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం ప్రభుత్వ అధికారిక విలువ రూ. 27.65 కోట్లుగా ఉన్నప్పటికీ.. వీటి ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ రూ. 100 కోట్ల నుండి రూ. 150 కోట్ల మధ్య ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read

గతంలో కూడా ఈ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం గమనార్హం. 2019 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సమయంలో.. ఒక పని తుది అంచనా ఆమోదం కోసం రూ. 25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆ సమయంలో జరిపిన తనిఖీల్లో కూడా రూ. 26.52 లక్షల నగదతో పాటుగా రూ. 22.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణకు నగర న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బుధవారం అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్టు చేసిన వెంకట రమణను గురువారం ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.కేసు వివరాలను పరిశీలించిన కోర్టు, ఆయనను రెండు వారాలపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం వెంకట రమణను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నిందితుడి బినామీ లావాదేవీలు, మిగిలిన పెట్టుబడులపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఏసీబీ రికార్డుల ప్రకారం ఇప్పటివరకు 2019 నాటి ఈఎస్‌ఐ మందుల సరఫరా కుంభకోణంలో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ. 25.70 కోట్ల అధికారిక విలువైన అక్రమాస్తులే మొదటి స్థానంలో ఉండేవి. అయితే ఇప్పుడు వెంకట రమణ వద్ద లభించిన ఆస్తుల అధికారిక విలువ రూ. 27,65,02,133గా తేలడంతో దేవికారాణి రికార్డును దాటి ఇది ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద కేసుగా నిలిచింది. ఏసీబీ సిటీ రేంజ్-2 డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో వెంకట రమణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.

స్వాధీనం చేసుకున్న ప్రధాన ఆస్తుల వివరాలు:

స్థిరాస్తులు: శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలలో నాలుగు ఫ్లాట్లు (రూ. 1.23 కోట్లు), కూకట్‌పల్లి అంజనేయ నగర్‌లో జీ+3 వాణిజ్య భవనం (రూ. 1.82 కోట్లు), గుట్టల బేగంపేట్‌లో జీ+5 వాణిజ్య భవనం (రూ. 2.90 కోట్లు).

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు: తన భార్య పేరిట ఉన్న నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా అంజనేయ నగర్, మూసాపేట, కూకట్‌పల్లిలలో నిర్మించిన 10 అపార్ట్‌మెంట్ల ప్రాజెక్టులు (అంచనా వ్యయం రూ. 20 కోట్లు).

చరాస్తులు & ఇతరాలు: 2.09 కేజీల బంగారు ఆభరణాలు, రూ. 52.02 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కియా, మహీంద్రా, బలెనో కార్లు (రూ. 45 లక్షలు), రూ. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్స్ & గృహోపకరణాలు మరియు రూ. 2.5 లక్షల విలువైన 20 మద్యం సీసాలు.

అడ్డదారిలో పోస్టింగ్ & లంచం చరిత్ర: వెంకట రమణ గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) సైబర్ సిటీ సర్కిల్‌లో డీఈగా పనిచేస్తున్నప్పుడు, డిసెంబర్ 12, 2019న ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. అప్పట్లో దాడులు చేసి రూ. 26.52 లక్షల నగదు, రూ. 22.60 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జైలు నుండి విడుదలయ్యాక.. ఆయన అడ్డదారిలో డిప్యూటేషన్‌పై 'రెడ్కో'లో పోస్టింగ్ సంపాదించి మళ్లీ అవినీతికి పాల్పడినట్లు తేలింది.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణకు నగర న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బుధవారం అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్టు చేసిన వెంకట రమణను గురువారం ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.కేసు వివరాలను పరిశీలించిన కోర్టు, ఆయనను రెండు వారాలపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం వెంకట రమణను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+