తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేడు మార్చి 19న ఉదయం 11:00 గంటలకు శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్. భట్టి సభలో ప్రసంగిస్తు కీలకమైన ఆర్థిక కేటాయింపులు అలాగే విధాన నిర్ణయాలు వెల్లడించారు.

తెలంగాణ బడ్జెట్ కీలక కేటాయింపులు అలాగే ప్రాధాన్యతలు
మొత్తం బడ్జెట్: రూ.3,04,965 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,26,982 కోట్లు
మూలధన వ్యయం: రూ.36,504 కోట్లు
అంచనా బడ్జెట్ పరిమాణం: రూ.3.10 లక్షల కోట్లు
రంగాల వారీగా కేటాయింపులు:
విద్య: రూ.23,108 కోట్లు
ఆరోగ్య సంరక్షణ: రూ.12,393 కోట్లు
వ్యవసాయం & గ్రామీణాభివృద్ధి: రూ.31,605 కోట్లు
సంక్షేమ పథకాలు:
SC సంక్షేమం: రూ.40,232 కోట్లు
ST సంక్షేమం: రూ.17,169 కోట్లు
బిసి సంక్షేమం: రూ.11,405 కోట్లు
మైనారిటీ సంక్షేమం: రూ.3,591 కోట్లు
మహిళా & శిశు సంక్షేమం: రూ.2,862 కోట్లు
మౌలిక సదుపాయాలు & అభివృద్ధి:
విద్యుత్ రంగం: రూ.21,221 కోట్లు
పరిశ్రమలు: రూ.3,527 కోట్లు
ఐటీ రంగం: రూ.774 కోట్లు
చేనేత పరిశ్రమ: రూ.371 కోట్లు
ఇతర విభాగాలు:
పశుసంవర్ధక శాఖ: రూ.1,674 కోట్లు
పౌర సరఫరాలు: రూ.5,734 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు: రూ.12,393 కోట్లు
"రైజింగ్ తెలంగాణ" కోసం ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం ఇంకా సంక్షేమానికి బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుంది అని ఉపముఖ్య మంత్రి భట్టి అన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన విస్తరణను కనబరుస్తోంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) 10.1% పెరిగింది. అదనంగా, తలసరి ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 9.6% పెరిగిందన్నారు. ముఖ్యంగా, తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి జాతీయ సగటు కంటే 1.8% ఎక్కువగా ఉంది, ఇది రాష్ట్ర బలమైన ఆర్థిక పనితీరు ఇంకా స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.


Click it and Unblock the Notifications