Adani Telangana News: అదానీ లంచాల ఆరోపణల వ్యహారం అగ్రరాజ్యం నుంచి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు చేరిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదానీ పెట్టుబడుల విషయంపై నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ చెల్లి షర్మిల చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తూ.. గతంలో అదానీతో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేయాలని కోరారు. ఇవి ఏపీ ప్రజలపై దాదాపు రూ.1.5 లక్షల కోట్ల భారాన్ని రానున్న 25 ఏళ్లలో మోపుతాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మరోపక్క తెలంగాణలో సైతం పరిస్థితులు మారిపోతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే అదానీ-ప్రధాని మోదీ సంబంధాలపై అనేకమార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అదానీపై చర్యలు తీసుకోవాలని హిండెన్ బర్గ్ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా డిమాండ్ చేయగా.. ప్రస్తుతం లంచాల వ్యవహారంలో వ్యాపారవేత్తను అరెస్ట్ కాకుండా మోదీ కాపాడుతున్నారని కూడా కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదానీ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

గతంలో అదానీ ప్రకటించిన విరాళాలు తెలంగాణకు వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. బిలియనీర్ గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్‌తో సహా పలువురిపై లంచం ఆరోపణలపై US కోర్టు అభియోగాలు మోపిన కొద్ది రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్ అందిస్తామని ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రభుత్వం అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌కు ప్రీతి జి అదానీకి లేఖను పంపింది. ప్రభుత్వం ఇప్పటివరకు దాతలలో ఎవరినీ భౌతిక బదిలీ కోసం అడగలేదని పేర్కొంది. సెక్షన్ 80G కింద యూనివర్శిటీ ఐటీ మినహాయింపును పొందలేదని తెలింది.
అక్టోబర్ 18, 2024న రూ.100 కోట్ల విరాళాన్ని అందజేయడానికి అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ తనను కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులు, వివాదాల దృష్ట్యా నిధుల బదిలీని కోరవద్దని ముఖ్యమంత్రి తనను ఆదేశించినట్లు తెలంగాణ ఐటీ అండ్ పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ నవంబర్ 24, 2024న అదానీ ఫౌండేషన్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి అదానీ గ్రూప్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్నిబిలిటీ కింద ఈ మెుత్తాన్ని తెలంగాణకు అందించాలని అప్పట్లో నిర్ణయించింది. అదానీ గ్రూప్ ఉదారమైన ఆఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూనే.. తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రాజెక్ట్ సమగ్రతను కాపాడటానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని లేఖలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం స్థాపించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ యువతకు వృత్తి శిక్షణ - నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications