CM Revanth Reddy- PM Narendra Modi: రాష్ట్రానికి రూ.30 కోట్ల సాయం చేయండి.. పీఎంను కోరిన పీఎం..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. న్యూఢిల్లీలోని ప్రధాని నివాసం లోక్ కల్యాణ్మార్గ్లో ఈ సమావేశం జరిగింది. డిసెంబరు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే గ్లోబల్ సమ్మిట్, అలాగే, డిసెంబరులో జరిగే ఖేలో ఇండియా క్రీడల ప్రారంభానికి ప్రధానిని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఆహ్వానించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలతో పాటు ఎల్నినో ప్రభావంపై మోదీతో సీఎం రేవంత్రెడ్డి బృందం చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను ప్రధానికి వివరించి కేంద్ర సహాయాన్ని సీఎం అడిగినట్లు తెలుస్తోంది.
365 మండలాలను కరువు మండలాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రూ.30వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. అలాగే,152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ నుంచి అనుమతులు ఇప్పించాలని ప్రధాని కోరినట్లు తెలుస్తోంది. గోదావరి - కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టును సమ్మక్కసాగర్ లేదా ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని, ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో 50 శాతం వాటాను తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి బృందం ప్రధానికి విజ్ఞప్తి చేసింది. సీతమ్మసాగర్ బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది.

ఎల్నినో వల్ల తెలంగాణలో ఏర్పడిన కరువు, వర్షాభావ పరిస్థితులపై ప్రధాని మోడీకి వివరించి కేంద్రాన్ని రూ.30 వేల కోట్ల తక్షణ సాయం కోరనున్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు 50 శాతం కేటాయించాలని కోరినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (ఏఐబీపీ)' కింద ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం, మంత్రులు చేసిన విజ్ఞప్తులను ప్రధాని సవధానంగా విన్నట్లు తెలుస్తోంది. రేపు కూడా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications