Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!
Revanth Reddy-Satya Nadella: అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను సీఎం రేవంత్ రెడ్డి నేడు కలిశారు. ఈ సమావేశం అధికారిక పర్యటనలో భాగంగా మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ క్రమంలో టెక్ దిగ్గజంం తెలంగాణ మైక్రోసాఫ్ట్ మధ్య సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా వచ్చిందని తెలుస్తోంది. భారతదేశంలో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న క్రమంలో తాజా భేటీ ఆసక్తిని సంతరించుకుంది.
కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈవో తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న తొలి సమావేశంలో క్లౌట్ కంప్యూటింగ్, ఏఐ, డిజిటల్ ఇన్ ఫ్రా వంటి కీలక రంగాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు చాలా కాలంగా మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ల వ్యాపారాన్ని ఇండియాలో విస్తరించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమావేశంలో దీనిపై కూడా కీలక చర్చ కొనసాగే అవకాశం ఉందని, తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్ చేసేందుకు సీఎం రేవంత్ చేస్తున్న ప్రయత్నాలకు తాజా మీటింగ్ ఒక వేదికగా మారుతుందని తెలుస్తోంది.

తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విస్తరణపై నేడు చర్చ జరగవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే కంపెనీ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నందిగామలో దాదాపు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో మేకగూడలో 22 ఎకరాలు, షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, చందన్‌వల్లిలో 52 ఎకరాలు టెక్ దిగ్గజం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కంపెనీ డేటాసెంటర్ల నిర్మాణ పనులు కూడా మూడొంతులు పూర్తయ్యాయని సమాచారం. డేటా సెంటర్ల వ్యాపారంలో ఇప్పటి వరకు అనేక ఉత్తరాధి రాష్ట్రాల్లో టెక్ కంపెనీలు తమ పెట్టుబడులను భారీగా పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కంపెనీ తెలంగాణలో చేపడుతున్న పెట్టుబడులు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ, టెక్ నిపుణులకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని భావిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదులో పెట్టుబడులపై మైక్రోసాఫ్ట్ సానుకూలంగా ఉన్నందున మరిన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ గురించి ముఖ్యమంత్రితో కీలక చర్చలు జరిగే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుతో పాటు స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామిగా మారాలని సీఎం ఈ క్రమంలో సత్య నాదెళ్లను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ముందు మైక్రోసాఫ్ట్ సెంటర్లో 4 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు ఒక ఒప్పందం కూడా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న సత్యనాదెళ్ల ఇండియా వచ్చిన ప్రతిసారి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి రావటం మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాం.


Click it and Unblock the Notifications