CM Revanth Reddy: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండేళ్లకు సరిపడ బియ్యం ఉన్నట్లు ప్రకటన..!
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కరువు వస్తుందని.. బియ్యం దొరకవని.. ధరలు కూడా భారీగా పెరుగుతాయని అని చెబుతున్నారు. ఇప్పటికే సన్న బియ్యం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి బియ్యం కొరత వస్తుందన్న వార్తలపై స్పందించారు. రాష్ట్రంలో రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నాయని, ఎల్‌నినో ప్రభావం ఎదురైనా ప్రజలకు ఆహార భద్రత విషయంలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కోడిగుడ్లు అందించేందుకు పౌల్ట్రీ పరిశ్రమ సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. పేద పిల్లలకు పోషకాహారం అందించడంలో పౌల్ట్రీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తోందని సీఎం తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ అనేక ఒడిదుడుకులు, సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అలాంటి సమయాల్లో ప్రభుత్వం పరిశ్రమకు అండగా నిలుస్తుందని సీఎం చెప్పారు. పరిశ్రమకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.

పౌల్ట్రీ రంగంలో పెట్టుబడులు, అభివృద్ధికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా మంజూరు చేస్తామన్నారు. పౌల్ట్రీ రంగం వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా మాత్రమే కాకుండా రైతులకు ఆదాయం, ప్రజలకు పోషకాహారం, యువత ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్ అందించే కీలక రంగంగా ఎదిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కాగా ఎల్ నినో వల్ల రాష్ట్రంలో వరి సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. బియ్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే రైతుల నుంచి సేకరించిన వడ్లతో బియ్యం తీసి గోదాముల్లో నిల్వ చేశారు.
ఈ నిల్వ చేసిన బియ్యం రెండు సంవత్సరాల వరకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎల్ నీనో ప్రభావం తొలగిపోయే అవకాశం ఉందని.. పంటలు బాగా పండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications