Revanth Reddy: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. అడక్కుండానే రూ.5 లక్షలు, పూర్తి వివరాలివే..
Indiramma Houses: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలను నెరవేర్చుకుంటూ పోతున్నారు. ప్రతిపక్షాలు పథకాలపై ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ సర్కార్ తమపానిని తాను శరవేగంగా చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలో అర్హులపైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కేంద్రం నుంచి దీనికోసం ఆర్థిక సహాయాన్ని కోరనున్నట్లు వెల్లడైంది.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని, అర్హుల ఎంపికలో అధికారులు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున మెుత్తం 4.5 లక్షల ఇళ్లను మెుదటి ఫేజ్ కింద నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇల్లు కట్టుకునేందుకు లబ్ధిదారులకు నాలుగు దఫాలుగా రూ.5 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో దళితులు, గిరిజనులు, వికలాంగులు, వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై తెలంగాణ గృహ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. అర్హులైన మహిళలకు సీఎం ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లను అందించటంలో తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటిని నిర్మించాల్సిన స్థలం తదితర సమాచారం రేపటి నుంచి జీరోయింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఇళ్లను నిర్మించేందుకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఏర్పాటు చేశారు. అలాగే రాజకీయలకు తావులేకుండా ఇందుకోసం యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.
మహిళల పేరు మీద మంజూరైన ఇళ్లకు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ సొమ్ము డీబీటీ పద్ధితి కింద ఎలాంటి మధ్యవర్తులకు తావులేకుండా నేరుగా ఖాతాల్లో జమచేయనున్నట్లు వెల్లడించారు. స్కీమ్ కింద 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఇళ్లలో వంటగది, టాయిలెట్ సౌకర్యాలు ఉంటాయని, గత కేసీఆర్ ప్రభుత్వం కింద ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్మాణాల్లో తొలగించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఎన్నికల హామీని నెరవేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడుతూ సీఎం రేవంత్ దేవాలయం లేని ఊరైనా ఉంటుంది కానీ ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదని అన్నారు. 2004-2014 మధ్య కాలంలో దాదాపు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్లు సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్కీమ్ కింద ప్రకటించిన ఇళ్లు వివిధ దశల నిర్మాణంలో నిలిచిపోయాయని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications