Telangana Loans: దివాళా అంచున తెలంగాణ.. అందుకు లోన్లు ఇచ్చేది లేదంటూ చేతులెత్తేసిన కేంద్రం
Telangana Loans: అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు బ్రేకులు పడినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం అప్పల ఊబిలో కూరుకుపోయి, దివాళా అంచుకు చేరినట్లు నివేదికలు వెలుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర మంత్రే కొత్త అప్పులను తిరిగి చెల్లించలేని పరిస్థితికి తెలంగాణ చేరినట్లు చెప్పడం.. రాష్ట్ర పరిస్థితికి అర్థం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కోసం రుణం సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి RK సింగ్ తెలిపారు. ఇందుకోసం కేంద్రం అధీనంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఆశ్రయించినట్లు చెప్పారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉండటంతో రుణాలు తిరిగి చెల్లించలేని PFC భావించిందని.. అందుకే యాదాద్రి ప్రాజెక్టుకు లోన్ మంజూరు చేయడం నిలిపివేసిందని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 29 వేల 600 కోట్లకు కాగా అందులో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(REC) మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(PFC)లు దాదాపు 16 వేల 70 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్న అంచనాల నడుమ.. రుణాల మంజూరు కావడం కష్టమేనన్నారు.
FRBM నిబంధనలకు విరుద్ధంగా తాము లోన్స్ మంజూరు చేయలేమన్నారు. రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉన్నారు కాబట్టే వారికి ఫైనాన్స్ చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. గత పదేళ్లుగా చూస్తే PFC మరియు RECలు 91 వేల కోట్లు, లక్షా 37 వేల 606 కోట్ల మేర రుణాలు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఇదే సమావేశంలో రాష్ట్ర BJP అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం.


Click it and Unblock the Notifications