Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ ను అందించింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై బడ్జెట్ భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అదెలాగంటే..
ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో హైదరాబాద్ విస్తరణకు సంబంధించిన పలు ప్రణాళిలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ నుండి 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణం వరకు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నగరం నలుమూలలా రియల్ ఎస్టేట్ వృద్ధికి కొత్త ఊపిరి పోయనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Hyderabad real estate) లో ఎలాంటి మార్పులు ఉండొచ్చంటే..

1. GHMC వికేంద్రీకరణతో పెరగనున్న డిమాండ్
ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ , మల్కాజ్‌గిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించింది.
- ప్రభావం: ఈ వికేంద్రీకరణ వల్ల పరిపాలన ప్రజలకు చేరువవడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది. గతంలో కేవలం హైటెక్ సిటీ వైపే ఉన్న రియల్ ఎస్టేట్ మొగ్గు, ఇప్పుడు మల్కాజ్‌గిరి , ఇతర శివారు ప్రాంతాలకు కూడా విస్తరించనుంది. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ , కమ్యూనిటీ వసతులు మెరుగుపడి భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.
2. భారత్ ఫ్యూచర్ సిటీ.. రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్
ముచ్చర్ల సమీపంలో 30,000 ఎకరాల విస్తీర్ణంలో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నిర్మిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు.
- ప్రభావం: ఇది హైదరాబాద్‌లో ఐటీ కారిడార్ తర్వాత అతిపెద్ద రియల్ ఎస్టేట్ హబ్ గా అవతరించబోతోంది. ఇక్కడ ఏఐ (AI) హబ్, స్కిల్ యూనివర్సిటీ , స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు కానుండటంతో దక్షిణ హైదరాబాద్ ప్రాంతం (South Hyderabad) ఇన్వెస్టర్లకు హాట్ కేక్ లా మారనుంది. విమానాశ్రయానికి సమీపంలో ఉండటం ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణ.
3. మెట్రో విస్తరణ , కనెక్టివిటీ
బడ్జెట్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను అనుసంధానించడం ద్వారా రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది.
- ప్రభావం: సాధారణంగా మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ప్రాపర్టీ విలువలు 20% నుండి 30% వరకు పెరుగుతాయి. కొత్త మెట్రో లైన్లు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, నగర శివారుల్లో నివాస గృహాల (Residential Projects) నిర్మాణానికి ఊతమిస్తాయి.
4. నెట్ జీరో , హైడ్రా (HYDRA) ప్రభావం
హైదరాబాద్‌ను కాలుష్య రహిత (Net Zero) నగరంగా మార్చడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే చెరువులు, కుంటల రక్షణ కోసం 'హైడ్రా'కు కొత్త చట్టబద్ధమైన అధికారాలను కల్పించింది.
- ప్రభావం: దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతుంది. నిబంధనల ప్రకారం నిర్మించే వెంచర్లకు డిమాండ్ పెరగగా, అక్రమ నిర్మాణాలపై భయం ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో నగర ప్రాపర్టీ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
మొత్తంగా చూస్తే తెలంగాణ బడ్జెట్ 2026 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిదని చెప్పవచ్చు. ప్రభుత్వం కేవలం నగర మధ్యభాగంపైనే కాకుండా, 30,000 ఎకరాల భారీ ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఢిల్లీ, ముంబైల సరసన హైదరాబాద్ (Hyderabad) ను ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టాలనే లక్ష్యం నెరవేరితే, రాబోయే ఐదేళ్లలో ఇక్కడి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications