తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతికి దిక్సూచిగా నిలిచే బడ్జెట్ (Telangana Budget 2026) ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి ప్రభుత్వం ఏకంగా రూ. 3,24,234 కోట్ల భారీ వ్యయంతో బడ్జెట్ ను రూపొందించింది. ఇందులో ఏయే శాఖకు ఎంత కేటాయించారో ఇప్పుడు చూద్దాం.
ప్రజల ఆకాంక్షలు, ఎన్నికల హామీలు , రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ పద్దును సమతుల్యంగా తీర్చిదిద్దారు. గత బడ్జెట్ తో పోలిస్తే కేటాయింపుల్లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి , విద్యా రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.
బడ్జెట్ అంచనాలు.. వ్యయం..
ఈ ఏడాది మొత్తం వ్యయం రూ. 3,24,234 కోట్లుగా ఉండగా అందులో రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లుగా అంచనా వేశారు. ఇక రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన , అభివృద్ధి పనుల కోసం కేపిటల్ ఎక్స్‌పెండిచర్ (Capital Expenditure) కింద రూ. 47,267 కోట్లు కేటాయించారు. అప్పుల భారాన్ని తగ్గిస్తూనే, సంపద సృష్టిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ప్రధాన శాఖల వారీగా కేటాయింపులు
బడ్జెట్‌లో ప్రతి రంగానికి సముచిత స్థానం కల్పిస్తూ నిధుల పంపిణీ జరిగింది. ముఖ్యంగా గ్రామ సీమల అభివృద్ధి కోసం పంచాయతీ రాజ్ శాఖకు సింహభాగం నిధులు దక్కాయి.
- పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి: రూ. 33,688 కోట్లు
- విద్య: రూ. 26,674 కోట్లు
- వ్యవసాయం: రూ. 23,179 కోట్లు
- సాగునీటి రంగం (Irrigation): రూ. 22,615 కోట్లు
- విద్యుత్ శాఖ (Energy): రూ. 21,285 కోట్లు
- మున్సిపల్ పరిపాలన: రూ. 17,907 కోట్లు
- వైద్యం & ఆరోగ్యం: రూ. 13,679 కోట్లు
- రవాణా, రహదారులు & భవనాలు: రూ. 12,789 కోట్లు
- బీసీ సంక్షేమం: రూ. 12,511 కోట్లు
- హోం శాఖ: రూ. 11,907 కోట్లు
- ఎస్సీ సంక్షేమం: రూ. 11,784 కోట్లు
- ఎస్టీ సంక్షేమం: రూ. 7,937 కోట్లు
- గృహ నిర్మాణం (Housing): రూ. 7,430 కోట్లు
- పౌర సరఫరాలు: రూ. 7,366 కోట్లు
- మైనారిటీల సంక్షేమం: రూ. 3,769 కోట్లు
- పరిశ్రమలు: రూ. 3,490 కోట్లు
- మహిళా & శిశు సంక్షేమం: రూ. 3,143 కోట్లు
- పశుసంవర్ధక & మత్స్య శాఖ: రూ. 1,529 కోట్లు
- పర్యాటక రంగం: రూ. 1,224 కోట్లు
- కార్మిక సంక్షేమం: రూ. 998 కోట్లు
- ఐటీ (IT) శాఖ: రూ. 875 కోట్లు
- చేనేత రంగం: రూ. 258 కోట్లు
సంక్షేమానికి పెద్దపీట
బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించింది. బీసీ సంక్షేమానికి రూ. 12,511 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ. 11,784 కోట్లు , ఎస్టీ సంక్షేమానికి రూ. 7,937 కోట్లు కేటాయించారు. మైనారిటీల సంక్షేమం కోసం రూ. 3,769 కోట్లు కేటాయించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. అలాగే, మహిళా , శిశు సంక్షేమ శాఖకు రూ. 3,143 కోట్లు దక్కాయి.
పరిశ్రమలు, ఇతర రంగాలు
రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించేందుకు పరిశ్రమల శాఖకు రూ. 3,490 కోట్లు, ఐటీ (IT) రంగానికి రూ. 875 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణ పథకాల కోసం రూ. 7,430 కోట్లు, పౌర సరఫరాల కోసం రూ. 7,366 కోట్లు కేటాయించడం ద్వారా నిరుపేదల అవసరాలకు పెద్దపీట వేశారు. పశుసంవర్ధక, మత్స్య శాఖలకు రూ. 1,529 కోట్లు, పర్యాటక రంగానికి రూ. 1,224 కోట్లు కేటాయించారు.


Click it and Unblock the Notifications