Telangana Budget 2025: నేడు తెలంగాణ ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి రూ.3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. గత ఏడాది మెుదట మధ్యంతర బడ్జెట్ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో చాలా మంది ప్రభుత్వం నుంచి ఎన్నికల్లో ప్రకటించిన హామీల నుంచి అనేక ఇతర కీలక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఉదయం 11 గంటల నుంచి బడ్జెట్ మెుదలు కానున్నందున శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Mar 19, 2025, 12:35 pm IST
నేటి నూతన బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18,000 వేల కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి
Mar 19, 2025, 12:32 pm IST
ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లను బడ్జెట్లో కేటాయించిన కాంగ్రెస్ సర్కార్
Mar 19, 2025, 12:25 pm IST
ఈసారి పాఠశాలలు ప్రారంభం అయ్యే రోజే విద్యార్ధులందరికీ పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్ అందించాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్
Mar 19, 2025, 12:22 pm IST
కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్ కోసం రూ.47 కోట్లు కేటాయించిన తెలంగాణ సర్కార్
Mar 19, 2025, 12:21 pm IST
చైనా ప్లస్ వన్ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్
Mar 19, 2025, 12:20 pm IST
తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ప్లాన్ 2050 రూపొందించినట్లు పేర్కొన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 12:16 pm IST
తాజా బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకి రూ.5,734 కోట్లను కేటాయించిన భట్టి విక్రమార్క
Mar 19, 2025, 12:11 pm IST
మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు అందించేలా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి భట్టి
Mar 19, 2025, 12:10 pm IST
ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటును ప్రకటించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
రైతు భరోసా - రూ.18 వేల కోట్లు తాజా వార్షిక బడ్జెట్లో కేటాయించిన తెలంగాణ సర్కార్
Mar 19, 2025, 11:53 am IST
ఆరు గ్యారంటీలు - రూ.56,084 కోట్లు కేటాయించిన భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:52 am IST
ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు నిధులను బడ్జెట్లో కేటాయించిన ఆర్థిక మంత్రి భట్టి
Mar 19, 2025, 11:51 am IST
విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్
Mar 19, 2025, 11:51 am IST
2024-25 ఏడాది తలసరి ఆదాయం రూ.3,79,751గా వెల్లడించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:50 am IST
వాహనాలపై పన్ను ఆదాయం రూ.8,535 కోట్లు కోట్లుగా పేర్కొన్న తెలంగాణ వార్షిక బడ్జెట్
Mar 19, 2025, 11:49 am IST
ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.27,623 కోట్లు
గా బడ్జెట్లో అంచనాలను పంచుకున్న భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:49 am IST
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.19,087 కోట్లు పేర్కొన్న ఆర్థిక మంత్రి భట్టి
Mar 19, 2025, 11:47 am IST
ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:46 am IST
ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుపై మంజూరు చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్
Mar 19, 2025, 11:43 am IST
గృహజ్యోతి స్కీమ్ కింద 50 లక్షల కుటుంబాలకు లబ్ధి, రూ.1,775 కోట్లు రాయితీ చెల్లింపు
Mar 19, 2025, 11:42 am IST
సిలిండర్ల రాయితీ కింద రూ.433 కోట్లు చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం
Mar 19, 2025, 11:42 am IST
రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్న ఆర్థిక మంత్రి భట్టి
Mar 19, 2025, 11:42 am IST
ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి పెరిగిందన్న ఆర్థిక మంత్రి
Mar 19, 2025, 11:41 am IST
ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ.5,006 కోట్లు ఆదా అయ్యాయన్న భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:40 am IST
తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు.- భట్టి
Mar 19, 2025, 11:40 am IST
అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయంచడం అన్యాయం.- భట్టి
Mar 19, 2025, 11:37 am IST
వ్యవసాయ మార్కెట్లకు రూ. 181 కోట్లతో ఆధునిక సదుపాయాలు
Mar 19, 2025, 11:35 am IST
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్
Mar 19, 2025, 11:35 am IST
తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గుదల
Mar 19, 2025, 11:34 am IST
పశు సంవర్థక శాఖకు రూ. 1,647 కోట్లు
Mar 19, 2025, 11:33 am IST
దేశ తలసరి ఆదాయం రూ.2,05,579 కోట్లు
Mar 19, 2025, 11:33 am IST
దేశ జీడీపీ రూ.3,31,03,215 కోట్లు
Mar 19, 2025, 11:33 am IST
దేశ తలసరి ఆదాయ వృద్ధిరేటు 8.8 శాతం
Mar 19, 2025, 11:33 am IST
గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతం నమోదు
Mar 19, 2025, 11:33 am IST
జీఎస్డీపీ వృద్ధి రేటు 10.1 శాతం, జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం
Mar 19, 2025, 11:33 am IST
జీఎస్డీపీ వృద్ధిరేటు జీడీపీ వృద్ధిరేటు కంటే ఎక్కువ
Mar 19, 2025, 11:32 am IST
రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు 9.6 శాతం
Mar 19, 2025, 11:32 am IST
2024-25 ఏడాది తలసరి ఆదాయం రూ.3,79,751
Mar 19, 2025, 11:32 am IST
దేశ తలసరి ఆదాయానికి రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు
Mar 19, 2025, 11:32 am IST
ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్డీపీ రూ.16,12,579 కోట్లు
Mar 19, 2025, 11:32 am IST
రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు 9.6 శాతం
Mar 19, 2025, 11:31 am IST
ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చును 20 శాతం పెంపు
Mar 19, 2025, 11:30 am IST
వైద్య కళాశాలలకు భారీగా నిధులు కేటాయింపు,58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి రూ.11,600 కోట్లు కేటాయింపు
Mar 19, 2025, 11:29 am IST
ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.. స్కూల్స్ లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ తో పాటు ఉచిత వసతులు.. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు
Mar 19, 2025, 11:29 am IST
కొత్తగా 1835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక
Mar 19, 2025, 11:29 am IST
ఆరోగ్య శ్రీ పరిధి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు
Mar 19, 2025, 11:28 am IST
ఏఐ సిటీలో ప్రత్యేక టెక్ హబ్
ఏఐ సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం.. సంక్షేమ వసతి గృహాల్లో కామన్ డైట్ స్కీం అమలు ప్రారంభం.. పాఠశాలల్లో గ్రీన్ ఎనర్జీ కోసం సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు..
Mar 19, 2025, 11:27 am IST
కార్మికశాఖ – రూ.900 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
మహిళా శిశుసంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
చేనేత రంగం - రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
పరిశ్రమలు - రూ.3,527 కోట్లు
ఐటీ రంగం - రూ.774 కోట్లు
విద్యుత్ రంగం - రూ.21,221 కోట్లు
వైద్య రంగం - రూ.12,393 కోట్లు
పురపాలక రంగం - రూ.17,677 కోట్లు
నీటిపారుదల శాఖ – రూ.23,373 కోట్లు
రహదారులు, భవనాలశాఖ – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం - రూ.775 కోట్లు
క్రీడలు - రూ.465 కోట్లు
అటవీ, పర్యావరణం - రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ – రూ.190 కోట్లు
హోంశాఖ – రూ.10,188 కోట్లు
Mar 19, 2025, 11:24 am IST
విద్యా రంగం - రూ.23,108 కోట్లు
Mar 19, 2025, 11:24 am IST
పౌరసరఫరాలశాఖ - రూ.5,734 కోట్లు
Mar 19, 2025, 11:24 am IST
పశుసంవర్ధకం - రూ.1,674 కోట్లు
Mar 19, 2025, 11:24 am IST
వ్యవసాయశాఖ - రూ.24,439 కోట్లు
Mar 19, 2025, 11:24 am IST
మూలధన వ్యయం - రూ.36,504 కోట్లు
Mar 19, 2025, 11:24 am IST
రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లు
Mar 19, 2025, 11:24 am IST
2025-26 రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు
Mar 19, 2025, 11:20 am IST
ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యానికి భారీ మద్దతు
Mar 19, 2025, 11:20 am IST
హైదరాబాదును గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్- భట్టి
Mar 19, 2025, 11:19 am IST
రైజింగ్ తెలంగాణ 2050 ప్రకటించిన ఆర్థిక మంత్రి భట్టి
Mar 19, 2025, 11:16 am IST
మెుత్తం బడ్జెట్ 3.04 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:15 am IST
గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక , దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:15 am IST
రానున్న కాలంలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చటమే తమ లక్ష్యమన్న భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:14 am IST
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 200 మిలియన్ డాలర్లు
Mar 19, 2025, 11:13 am IST
కాంగ్రెస్ సర్కార్ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రసంగం కావటం గమనార్హం
Mar 19, 2025, 11:12 am IST
తెలంగాణ ప్రజలు మమ్మల్లి నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నాం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mar 19, 2025, 11:12 am IST
తమ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి జోడుగుర్రాలన్న భట్టి
Mar 19, 2025, 11:11 am IST
భట్టి విర్కమార్క మూడోసారి బడ్జెట్ ప్రసంగం
Mar 19, 2025, 11:10 am IST
బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ చేసిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 10:16 am IST
ఆదాయం అంచనాల కంటే రూ.50 వేల కోట్లు తగ్గుదల నమోదయ్యే అవకాశం
Mar 19, 2025, 10:14 am IST
ఉదయం 11.14 గంటలకు బడ్జె్ట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 10:13 am IST
ప్రజాభవన్ లోని నల్లపోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన భట్టి విక్రమార్క దంపతులు
Mar 19, 2025, 10:11 am IST
బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్, రీజినల్ రింగ్ రోడ్, రైల్ కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వంటి కీలక మౌలిక సదుపాయాలకు కేటాయింపులు ఉండే అవకాశం
Mar 19, 2025, 10:08 am IST
బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 9:47 am IST
ఈసారి ఇందిరమ్మ హౌసింగ్, మహిళలకు సారెల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు వంటి స్కీమ్స్ కేటాయింపులు ఉండే ఛాన్స్
Mar 19, 2025, 9:47 am IST
మహిళల కోసం ఉచిత బస్ ప్రయాణం, రైతు భరోసా, పంట రుణ మాఫీలు, ఎల్పీజీ సబ్సిడీలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలు
Mar 19, 2025, 9:37 am IST
రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ వస్తున్న బడ్జెట్
Mar 19, 2025, 9:36 am IST
బడ్జెట్లో భారీ లోటు ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనా
Mar 19, 2025, 9:29 am IST
పెరుగుతున్న బడ్జెట్ కి అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచుకోవటంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
Mar 19, 2025, 9:08 am IST
ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్న క్యాబినెట్
Mar 19, 2025, 9:07 am IST
వ్యవసాయం, గృహ నిర్మాణాలు, సంక్షేమ పథకాల కేటాయింపులపై ప్రజల దృష్టి
Mar 19, 2025, 9:07 am IST
ఈసారి వార్షిక బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లుగా ఉండొచ్చని సమాచారం
Mar 19, 2025, 9:06 am IST
మండలిలో బడ్జెట్ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
Mar 19, 2025, 9:06 am IST
అసెంబ్లీలో ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 9:03 am IST
ఇప్పటిలే బడ్జెట్ లెక్కలు పక్కాగా సిద్ధం చేసిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
Mar 19, 2025, 9:03 am IST
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్న తెలంగాణ మండలి
Mar 19, 2025, 9:02 am IST
తాజా బడ్జెట్లో ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఇచ్చిన 6 హామీలకు ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం
Mar 19, 2025, 9:01 am IST
గత బడ్జెట్ మెుత్తం రూ.2.9 లక్షల కోట్లుగా ఉంది
Mar 19, 2025, 9:00 am IST
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండవ బడ్జెట్
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.