గత ఏడాది బడ్జెట్ 2024 హైలెట్స్ ఇవే.. అప్పులు, ఆదాయాలు, శాఖల కేటాయింపులు ఎంతంటే ?

తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి మీకు తెల్సిందే. అయితే అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ ఇన్‌చార్జ్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యా శాఖకు రూ.21,292 కోట్లు, నీటిపారుదల కోసం రూ.22,301 కోట్లు, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధికి రూ.29,816 కోట్లను, రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టుకు రూ.1525 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.

Telangana Budget 2024 highlets know the debt revenue and allocations in congress first budget

శాఖల వారీగా ప్రతిపాదిత కేటాయింపులు చూస్తే వ్యవసాయానికి రూ.72,659 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.29,816 కోట్లు, నీటిపారుదలకి రూ.22,301 కోట్లు, ట్రాన్స్‌కో & డిస్కామ్‌లకు రూ.16,410 కోట్లు, వైద్య & ఆరోగ్యానికి రూ.11,468 కోట్లు, రోడ్లు & భవనాల విభాగానికి రూ.5,790 కోట్లు, హోం శాఖకు రూ.9,564 కోట్లు, పరిశ్రమలకు రూ.2,762 కోట్లు, ఐటీకి రూ.774 కోట్లు, స్త్రీ & శిశు సంక్షేమానికి రూ.2,736 కోట్లు, అటవీ & పర్యావరణానికి రూ.1,064 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.3003 కోట్ల ప్రతిపాదిత కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.

తెలంగాణ బడ్జెట్‌లో GHMCకి రూ.3,065 కోట్లు, HMDAకి రూ.500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ.3,385 కోట్లు ప్రతిపాదించగా, HYDRAAకి రూ.200 కోట్లు, విమానాశ్రయానికి మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ORRకి రూ.200 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించారు. గత ఏడాది డిసెంబర్ నుండి ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా ఇంకా బియ్యం సబ్సిడీ వంటి వివిధ పథకాలకు రూ.34579 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మొత్తం మీద 2024-25 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ.2,91,159 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.42892 కోట్ల అప్పులు తీర్చిందని, రూ.35118 లక్షల కోట్ల అప్పులు తీసుకుందని భట్టివిక్రమార్క అన్నారు. నీటిపారుదల శాఖకు రూ.26000 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.40000 కోట్లు కేటాయింపు చేయగా, డిసెంబర్ 2023 నాటికి తెలంగాణపై రూ.6.71 లక్షల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+