Telangana Budget: కరోనా సమయంలోనూ తెలంగాణ ముందుకు సాగటంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణా మోడల్ అభివృద్ధి దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ పెట్టుబడులకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం 11.8 శాతం తలసరి ఆదాయంతో రికార్డు సృష్టించిందన్నారు.
ఈ సారి బడ్జెట్..
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2,90,396 కోట్లుగా ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు, ఆయిల్ ఫామ్ కు రూ.1000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు.
సంక్షేమానికి పెద్ద పీట..
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత ఈ సారి కూడా తగ్గలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో దళితబందు పథకానికి రూ.17,700 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు, గిరిజన సంక్షేమం ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది.

వ్యవసాయం..
రైతన్నను నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లను వెచ్చించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ తెచ్చిన రైతుబంధు పథకం గుర్తింపు పొందిన విషయాన్ని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రస్థావించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications