Telangana Budget: ఐటీ రంగానికి రూ.360 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు గురువారం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)కు రెండో టెన్యూర్‌లో ఇది మూడో బడ్జెట్. మార్చి 15 సోమవారం ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగుస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,30,825 కోట్లతో హరీష్ రావు నేడు శాసన సభలో ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,393.44 కోట్లుగా వెల్లడించారు.
బడ్జెట్ ప్రకారం ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు, మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు, సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ.వెయ్యి కోట్లు, రైతు బంధుకు రూ.12,000 కోట్లు, రుణమాఫీకి రూ.5225 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.16,931 కోట్లు, భూసమగ్ర సర్వేకు రూ.400 కోట్లు కేటాయించారు.

ఐటీ రంగానికి రూ.360 కోట్లు కేటాయించారు. దేశ సగటు ఐటీ ఎగుమతుల వృద్ధి 8.09 శాతంగా ఉండగా, తెలంగాణ రాష్ట్రం నుండి వృద్ధి మాత్రం 17.93 శాతం ఉన్నట్లు హరీష్ రావు తెలిపారు. కొత్త ఎడ్యుకేషన్ స్కీంకు రూ.4వేల కోట్లు కేటాయించారు. మైనార్టీ వెల్ఫేర్‌కు రూ.1602 కోట్లు, వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌కు రూ.1702 కోట్లు కేటాయించారు.


Click it and Unblock the Notifications