KTR News: కేటీఆర్ టూర్ సక్సెస్.. కంపెనీలు క్యూ కట్టడంతో 42 వేల కొలువులు..

Hyderabad News: దేశంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షనీయ నగరంగా హైదరాబాద్ మారిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఆయన ఇటీవల యూఎస్, యూకే లలో పర్యటించారు.

కేటీఆర్ పర్యటనలో మెుత్తంగా 16 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈక్రమంలో కంపెనీలు మెుత్తంగా వివిధ రంగాల్లో రూ.5,800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపాయి. వీటి ద్వారా తెలంగాణలో దాదాపు 42 వేల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని వెల్లడైంది.

 ktr

రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి కోసం కేటీఆర్ చేపట్టిన రెండు వారాల టూర్ విజయవంతం కావటంతో తెలంగాణ ప్రజలు మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ హోర్డింగులు కూడా వెలిశాయి. ఈ పర్యటనలో మంత్రి తెలంగాణలో ఉన్న అపార వ్యాపార వనరుల గురించి విదేశాల్లోని పారిశ్రామిక వేత్తలకు వివరించి పెట్టుబడులను ఆకర్షించటంలో విజయవంతం అయ్యారని యువత భావిస్తోంది.

అయితే ఈ క్రమంలో #42000jobs అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం తెలంగాణకు రోజూ ఏదో ఒక కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు రావటం ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషికి అద్ధం పడుతోందని స్థానికి ప్రజలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+