Percapita Income: దేశంలో తలసరి ఆదాయం, రానున్న కాలంలో ఆదాయాల వృద్ధిపై స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ తాజా రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు మంచి స్థానంలో నిలిచాయి.
పరిశోధనా నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 2,450 డాలర్లుగా ఉంది. అయితే ఇది రానున్న కాలంలో అంటే 2030 నాటికి 70 శాతం పెరిగి 4,000 డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించింది. దేశంలో గృహ వినియోగం పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది.

తాను ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే తన తర్వాతి కాలంలో ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకునేలా చూస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మైలురాయిని సాధించడం ద్వారా జపాన్, జర్మనీ వంటి దేశాలను అధిగమించి భారత్ ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. దేశంలో పని చేసే వయస్సు జనాభా వాటా 2020లో 64.2 శాతం నుంచి 2040 నాటికి 64.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేయబడింది.

2023 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం లీగ్ పట్టికలో తెలంగాణ రూ.2,75,443తో అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత కర్ణాటక రూ.2,65,623, తమిళనాడు రూ.2,41,131, కేరళ రూ.2,30,601, ఆంధ్రప్రదేశ్ రూ.2,07,771లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఏదేమైనప్పటికీ 2030 నాటికి తలసరి ఆదాయంలో గుజరాత్ ముందంజలో ఉంటుందని నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉంటాయని నివేదిక సూచిస్తోంది. అలాగే జాతీయ డీజీపీకి తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ సమిష్టిగా 20 శాతం సహకరిస్తాయని వెల్లడైంది.


Click it and Unblock the Notifications