Revanth Reddy: తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వేగంగా పెట్టుబడులను ఆకట్టుకోవటంతో పాటు వాటిని వాస్తవరూపం దాల్చేందుకు కృషి చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి నిదర్శనం ప్రస్తుతం టెక్ రంగంలో టాప్-5 సంస్థల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ క్యాంపస్ విస్తరణే. వాస్తవానికి గత నెలలో దావోస్ వేధికగా ఒప్పందం జరగగా రికార్డు సమయంలో దానిని ఆచరణలోకి తీసుకురావటానికి ప్రభుత్వం కూడా చొరవ చూపించింది.
ఈ క్రమంలో నేడు హెచ్‌సీఎల్ టెక్ నూతన క్యాంపస్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేసిన సీఎం ప్రతిరోజూ తెలంగాణ ప్రభుత్వం పెద్ద కార్పొరేట్ కంపెనీలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటూ పెట్టుబడులను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాదు నగరం అత్యంత వేగంగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలను కల్పించటంతో దేశంలోనే మెుదటి స్థానంలో ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోందని పేర్కొన్నారు.

త్వరలోనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంటుందని, తాను చెప్పిన మాటలు నిజమవుతాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు దావోస్ పర్యటనల ద్వారా మెుదటి సారి రూ.41,000 కోట్లు, ఇటీవల రెండవసారి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఎంవోయూలు కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్థావిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే దావోస్ పర్యటనలో తాను దేశంలోని ఇతర నగరాలతో సీఎంలతో పోటీ పడటం లేదని హాంకాంగ్, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణను డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్ రైజింగ్ ఆగదని, అభివృద్ధి కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
గ్లోబల్ కంపెనీగా ఎదిగిన ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ భారతదేశానికే గర్వకారణంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తూ 2.2 లక్షల మందికి ఉపాధికి కల్పిస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఏఐ, క్లౌడ్, ఇంజనీరింగ్ సహా అనేక సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications