Teerth Gopicon IPO: కరోనా తర్వాత మార్కెట్లోకి వరుసగా ఐపీవోలు వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి గత ఏడాది నుంచి వస్తున్న ఐపీవోల్లో మెజారిటీ ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చేశాయి.
ఈ క్రమంలో మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలపై బెట్టింగ్ వేసి లాభాలను ఆర్జిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరిగింది. ప్రస్తుతం తీర్థ గోపికాన్ లిమిటెడ్ IPO ఏప్రిల్ 8న తెరవబడుతుంది. ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.44.40 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ NSE ఎమర్జ్ ప్లాట్‌ఫారమ్‌లో లిస్టింగ్ కోసం ఒక్కో షేరుకు రూ.111 ఇష్యూ ధరతో 39.99 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. మార్కెట్లోకి ప్రవేశించకుమందరే కంపెనీ షేర్లు గ్రేమార్కెట్లో ఒక్కోటి రూ.18 ధర పలుకుతున్నాయి. దీని ప్రకారం లిస్టింగ్ రూ.129 అంటే 16.22% ప్రీమియంను సూచిస్తుంది.

రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తీర్థ గోపికాన్ లిమిటెడ్ ఐపీవో ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 10 వరకు తెరవబడుతోంది. పెట్టుబడిదారుల కోసం కంపెనీ లాట్ పరిమాణాన్ని 1200 షేర్లగా నిర్ణయించింది. దీనికోసం పెట్టుబడిదారులు కనీసం రూ.133 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇష్యూ ద్వారా సేకరించిన నిధులు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ లక్ష్యాలను తీర్చడానికి వినియోగించనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లో కంపెనీ రూ.69.70 కోట్ల ఆదాయాన్ని, రూ.7.84 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. జనవరి 31, 2024 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ రూ.904.98 కోట్లుగా ఉంది. తీర్థ గోపికాన్ లిమిటెడ్ కంపెనీ.. ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రత్యేకత కలిగి ఉంది. అలాగే ప్రధానంగా రోడ్లు, మురుగునీటి పారుదల, నీటి పంపిణీ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. మధ్యప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ 2019లో స్థాపించబడింది. ఎంపీలోని ఇండోర్, ఛతర్‌పూర్, సాగర్, దిండోరి, జబల్‌పూర్ మరియు ఉజ్జయిని నగరాల్లో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ కంపెనీ తన ఉనికిని విస్తరిస్తోంది.


Click it and Unblock the Notifications