startups: భారతదేశపు ప్రీమియర్ స్టార్టప్ కాన్ఫరెన్స్ TechSparks ముంబైలో జరగనుంది. 13 ఏళ్లలో తొలిసారిగా YourStory ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించనున్నారు. మార్చి 22, 23 తేదీల్లో ఈ మెగా ఈవెంట్ కు గ్రాండ్ హయత్ ముంబై సిద్ధమవుతోంది. 'బిల్డిండ్ ఆన్ ఇండియాస్ టెక్' ఎజెండాగా ఈ సదస్సు జరగనుంది. తద్వారా వివిధ యూనికార్న్ ల వ్యవస్థాపకులు, ఇన్ ఫ్లూయెన్సర్లు, కంటెంట్ సృష్టికర్తలు, గ్లామర్ పరిశ్రమకు చెందిన పలువురు అనుభవఙులు ఒకేచోట కొలువుదీరనున్నారు.

వేలాదిగా హాజరు:
నిష్ణాతులైన 150కి పైగా ప్రఖ్యాత ఉపన్యాసకులతో సహా మొత్తం 2 వేలకుపైగా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. భారత స్టార్టప్ ఎకోసిస్టం తాజా పోకడలు, ఆవిష్కరణలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై ఇందులో చర్చించనున్నారు. గత 13 ఏళ్లుగా సాంకేతిక ఆవిష్కరణలకు TechSparks డెస్టినేషన్ గా మారింది. పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, పలువురు వాటాదారుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఆవిష్కరణలకు గమ్యస్థానంగా..
ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్ల మూలధనాన్ని TechSparks ద్వారా సమీకరించగలిగారు. అభివృద్ధి చెందుతున్న, అత్యాధునిక సాంకేతికతల ఆవిష్కరణలకు ఇది గమ్యస్థానంగా పేరుగాంచింది. దేశీయంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నెలకొల్పిన విజయవంతమైన కంపెనీల ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం లభిస్తోంది. ఆరోగ్యకరమైన, అర్థవంతమైన మార్గంలో నిపుణులతో కనెక్ట్ కావడానికి దీనిని ఓ మార్గంగా చెప్పవచ్చు.

మొదటి డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్:
2008లో స్థాపించబడిన 'యువర్ స్టోరీ'.. భారతదేశంలోని మొదటి డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీల వ్యవస్థాపకులు, విధాన రూపకర్తల సానుకూల కథనాలను ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటుంది.ఇప్పటి వరకు 150 వేల ఉత్సాహపూర్వక కథనాలను అందిస్తూ.. 12 భారతీయ భాషల్లోకి విస్తరించింది.ఈ నెలలో ముంబైలో జరగునున్న TechSparks ఈవెంట్లో పాల్గొనేందుకు https://yourstory.com/techsparks-mumbai2023/registration ద్వారా ఉత్సాహవంతులు నమోదు చేసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications