IT News: టెక్ ఉద్యోగులకు అసలైన కష్టకాలం మెుదలైందని చెప్పుకోవాలి. ఇన్నాళ్లుగా ఉన్న ఇబ్బందులు ఒకరకమైతే ఇకపై రాబోతున్నది పీక్స్ అని చెప్పుకోవాలి. దీంతో ఉద్యోగాల మనుగడ కష్టతరంగా మారుతుందని నివేదికలు చెబుతున్నాయి.
ఇటీవలి సంవత్సరాల్లో సాంకేతిక పురోగతి వ్యాపారాలు, పరిశ్రమలు పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. దీంతో ఉద్యోగాల సంఖ్య ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతోంది. గడచిన రెండేళ్లుగా టెక్ రంగంలో పనిచేస్తున్నవారికి ఉద్యోగ భద్రత ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కంపెనీలు లాభాలు తక్కువై ఉద్యోగులను తగ్గించటం లేదు. సాంప్రదాయ పాత్రలను సాంకేతికతతో కంపెనీలు రీప్లేస్ చేయటమే తొలగింపులకు అసలు కారణంగా ఉంది. AI ఆధారిత సాంకేతిక చాలా తక్కువ మంది ఉద్యోగులతో నడుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఆటోమేషన్ ప్రారంభించాయి. మెరుగైన పనితీరును క్లైంట్లకు అందించే క్రమంలో.. ఆటోమేషన్ చాలా కంపెనీలకు ఇర్రెసిస్టిబుల్ ట్రెండ్‌గా మారింది. ఇది డేటా ప్రాసెసింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, కస్టమర్ సర్వీస్ వంటి పాత్రలను భర్తీ చేస్తున్నాయి. ఇది సాంకేతిక సంస్థల్లో గణనీయమైన ఉద్యోగ కోతలకు దారితీసింది. దీనికి మరో కోణాన్ని గమనిస్తే.. నిరుద్యోగిత, సామాజిక అసమానతల పెంపు, ఉద్యోగులకు కొత్త సమస్యలు, సవాళ్లకు కారణమౌతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఐటీ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగుల కోతల ట్రెండ్‌కి అర్థం టెక్ జాబ్ మార్కెట్ తగ్గిపోతుందని కాదు. సాంకేతిక పురోగతి కారణంగా అధునాతన నైపుణ్యాలు అవసరమయ్యే కొత్త పాత్రలు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల పాత జాబ్ రోల్స్ కనుమరుగవుతున్నాయి. ఈ క్రమంలో AI నిపుణులు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే టెక్ పరిశ్రమ పరివర్తన దశలో ఉందని స్పష్టమౌతోంది. టెక్ పరిశ్రమలో విజయవంతమైన కెరీర్ కోసం నిపుణులు నిరంతరం మారుతున్న సాంకేతిక పరిణామాలను అందిపుచ్చుకుంటూ తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications