IPO: వచ్చే వారం మరో రెండు ఐపీఓలు.. సోమవారం ఓపెన్, బుధవారం క్లోజ్..
ఐడియాఫోర్జ్ టెక్నాలజీస్, సైయెంట్ DLM, సెన్‌కో గోల్డ్ ఐపీఓలు స్టాక్ మార్కెట్ లో ప్రీమియంలో లిస్టయ్యాయి. శుక్రవారం ముగిసిన ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కూడా భారీగా సబ్స్ క్రైబ్ అయింది. ఇప్పుడు వచ్చే వారం మరో రెండు ఐపీఓలు రానున్నాయి. Netweb Technologies, Asarfi Hospital ఐపీఓలు రాబోతున్నాయి. ఈ రెండు IPOలు సోమవారం ప్రారంభమవుతాయి. వచ్చే వారం రాబోయే నెట్‌వెబ్ టెక్నాలజీస్ IPO పరిమాణం రూ.631 కోట్లు కాగా, Asarfi Hospital IPO పరిమాణం రూ.26.94 కోట్లుగా ఉంది.
నెట్‌వెబ్ టెక్నాలజీస్ IPO సోమవారం ప్రారంభమై బుధవారంతో ముగుస్తుంది. కంపెనీ ఈక్విటీ షేరును రూ.475 నుండి రూ.500 లుగా నిర్ణయించారు. నెట్‌వెబ్ టెక్నాలజీస్ IPO షేర్ల కేటాయింపు 24 జూలై 2023 జరిగే అవకాశం ఉంది. ఈ స్టాక్ BSE, NSE రెండింటిలోనూ లిస్టింగ్ కానుంది. నెట్‌వెబ్ టెక్నాలజీస్ IPO లిస్టింగ్ తేదీ 27 జూలై 2023 గా ఉంది. మార్కెట్ పరిశీలకుల ప్రకారం, Netweb Technologies Ltd షేర్లు ఈరోజు గ్రే మార్కెట్‌లో ₹338 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

ఇది నెట్‌వెబ్ టెక్నాలజీస్ IPO ధర బ్యాండ్ రూ.475 నుండి రూ.65 శాతం కంటే ఎక్కువ. Asarfi Hospital IPO ఇది ఎస్ఎంఈ ఐపీఓ. సోమవారం ప్రారంభమై బుధవారంతో ముగుస్తుంది. హెల్త్‌కేర్ సౌకర్యాలు అందించే కంపెనీ ఈక్విటీ షేరుకు రూ.51 నుంచి రూ.52 గా నిర్ణయించారు. Asarfi హాస్పిటల్ IPO షేర్ల కేటాయింపుకు అవకాశం ఉన్న తేదీ 24 జూలై 2023 గా ఉంది. Asarfi Hospital IPO లిస్టింగ్ తేదీ 27 జూలై 2023 ఉండే అవకాశం ఉంది. మార్కెట్ పరిశీలకుల ప్రకారం, Asarfi Hospital Ltd షేర్లు ఈరోజు గ్రే మార్కెట్‌లో రూ.12 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.


Click it and Unblock the Notifications