UK Recession: మాంద్యంలోకి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ..! రిషి సునక్‌కి సవాల్.. భారత్ పరిస్థితి
UK Economy: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని నెలలుగా రికవరీ సంకేతాలను చూపుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న యూకేలో మాత్రం పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి.
అవును క్రిస్టమస్ కి ముందర బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ పరిస్థితులు అక్కడ ఉన్న భారత సంతతి ప్రధాని, ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడికి కొత్త సవాళ్లను తీసుకురానున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి తాజాగా విడుదలైన మూడో త్రైమాసికంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం మేర క్షీణతను నమోదు చేసింది. ఆ దేశ జీడీపీ వృద్ధి రేటు వరుసగా తగ్గుతుండటం ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోంది.

ప్రస్తుతం యూకే ఆర్థిక పరిస్థితులు పెరుగుతున్న ఆర్థిక మాంద్యం ముప్పుకు అద్దం పడుతున్నాయని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మునుపటి మూడు నెలల నుండి మారలేదని గతంలో అంచనా వేశారు. అదేవిధంగా రెండవ త్రైమాసిక GDP ఇప్పుడు ఫ్లాట్‌గా ఉన్నట్లు అంచనా వేయబడింది. ఇది మునుపటి అంచనా 0.2% వృద్ధి నుంచి తగ్గించబడింది. అయితే శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం నవంబర్‌లో రిటైల్ అమ్మకాలు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ.. అక్టోబర్ నుంచి 1.3% పెరిగాయి.
ఇటీవలి కాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక మార్కెట్లలో పందెం పెంచడానికి సహాయపడి సెంట్రల్ బ్యాండ్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేర్కొంది. నాలుగో త్రైమాసికంలో కూడా యూకే ఆర్థిక వ్యవస్థ రికవరీకి కష్టపడుతున్న సంకేతాలను చూపుతున్న వేళ తేలికపాటి మాంద్యం ప్రారంభమై ఉండవచ్చని తాజా డేటా చెబుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మాంద్యం ప్రభావం భారత్ వంటి దేశాలపై పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కానీ భారత ఐటీ సేవల రంగంలోని కంపెనీలకు ఇది నిజంగా చేదు వార్తనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications