IT News: తెలివి మీరిన టెక్కీలు.. TCS, Infosys, Wipro, HCLలకు కొత్త సమస్య..!!
IT News: ప్రస్తుతం దేశీయ టాప్ టెక్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కష్టకాలంలో ఉద్యోగుల తీరు సైతం పెద్ద తలనొప్పిగా మారిందని దేశీయ ఐటీ సేవల సంస్థలు వాపోతున్నాయి.
ఇండియన్ టెక్ కంపెనీలు ప్రస్తుత గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్(GCC) వల్ల కొచ్చ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. బహుళజాతి కంపెనీల భారతీయ డెలివరీ కేంద్రాల ఉనికి పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో భారతీయ ఐటీ సేవల కంపెనీలు ఇటీవల జీతాల పెంపును ఆలస్యం చేయడం, వేరియబుల్ వేతనాలను తగ్గించడం, ప్రమోషన్లను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో టెక్కీలు వేరే ఉద్యోగాలు వెతుక్కుంటూ జీసీసీ కంపెనీలకు చెక్కేస్తున్నారు.

భారత టెక్ కంపెనీలు వ్యాపార పరిస్థితుల కారణంగా కొత్త నియామకాలను నిలిపివేసిన తరుణంలో ఉన్న టెక్కీలు హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని జీసీసీ కంపెనీల్లో 16.8 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ సంఖ్య 2026 నాటికి రెట్టింపు అవుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొత్త జీసీసీ శాఖలు ప్రారంభంతో పాటు ఉన్న వాటి విస్తరణ సైతం కొనసాగుతోంది. ఈ అవకాశాన్ని దేశీయ టెక్కీలు సరైన సమయంలో అందిపుచ్చుకునేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలకు స్వస్తి చెబుతున్నారు.
ఈ క్రమంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌లలో 4-10 ఏళ్ల అనుభవం ఉన్న ఐటీ ఉద్యోగులు 30-40 శాతం జీతాల పెంపుతో జీసీసీ కంపెనీలకు మారుతున్నారు. దీంతో ఉద్యోగుల అట్రిషన్ రేటు పెరుగుతూ కొత్త ఉద్యోగుల నియామకానికి కంపెనీలు ఎక్కువ మెుత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలో తమ ఉద్యోగులకు జీతాల పెంపును అందిస్తామని చెప్పాయి. సెప్టెంబర్‌లో ఐటీ సేవల కంపెనీల మొత్తం ఆదాయంలో జీతాల ఖర్చుల వాటా 56.6 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications