Trending post: ఖర్చులు తగ్గించుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఈ సమయంలో ఉన్న ఉద్యోగాన్ని ఎలా నిలుపుకోవాలో తెలియక అనేకమంది సతమతం అవుతున్నారు. అయితే భారీ వేతనాలు కలిగి ఉన్నా, ఇంకా ఏదో తక్కువైంది అన్నట్లు ప్రవర్తిస్తున్న వారూ లేకపోలేదు.
జీతం పెంపు, పదోన్నతి, ఊరిలో ఉద్యోగం వంటి కారణాల వల్ల సాధారణంగా ఉద్యోగులు కంపెనీలు మారుతూ ఉంటారు. అయితే ఓ టెక్కీ మాత్రం దిమ్మతిరిగిపోయే రీజన్ చెప్పాడు. తమ కంపెనీలో ఉచితంగా ఆహారం ప్రొవైడ్ చేయడం లేదంటున్నాడు. అందుకే తాను మరో ఉద్యోగానికి మారాలని చూస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఆ వ్యక్తి వార్షిక వేతనం 43.5 లక్షలు. ఇంత భారీ స్థాయిలో జీతం తీసుకుంటున్నా కూడా తనకు రోజూ 4 సార్లు మంచి భోజనం ఉచితంగా ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంటే చెప్పండి అంటూ సోషల్ మీడియాలో ప్లాట్ ఫారమ్ గ్రేప్‌వైన్ లో పోస్ట్ పెట్టాడు. దీన్ని యాప్ వ్యవస్థాపకులు సుమైల్ త్రిపాఠి తన X ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఇదికాస్తా పెద్ద చర్చకు దారితీసింది.
తాను రోజూ జిమ్‌కి వెళ్తానని, కాబట్టి ఆహారం కోసం చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. 4 మీల్స్‌లో మంచి ప్రొటీన్‌లు అధికంగా ఉండే ఫుడ్‌ను ఉచితంగా అందించే కంపెనీ కోసం చూస్తున్నట్లు చెప్పాడు. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. నాలుగు పూటలా భోజనం కోసం 43 లక్షల రూపాయల జీతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జొమాటోలో చేరితే మంచిదని కొందరు ఈ పోస్టుపై వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. భారీ జీతం వస్తున్నా తిండికి ఖర్చు పెట్టేందుకు ఎందుకు వెనకాడుతున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఆ జీతంతో సొంత ఫిట్‌నెస్ బ్రాండ్‌ను ప్రారంభించమని మరికొందరు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications