ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంటే, కొందరు మంచి ఉద్యోగం రావాలని మరికొందరు చదివిన చదువుకు తగ్గ హోదా ఉన్న ఉద్యోగం కోసం కోరుకుంటారు. కానీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నలలో సినిమా స్టోరీనే మించేపోయే ట్విస్ట్ ఇచ్చాడు ఓ యువకుడు. ఇన్ఫోసిస్ బెంగుళూరులో ఒక యాంగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 'డ్రాగన్' అనే తమిళ సినిమా చూసి సేమ్ టు సేమ్ అలంటి ఒక స్టంట్ చేసాడు. కానీ రీల్ లైఫ్'లో ఉన్నట్లు నిజ జీవితంలో ఉండదు కదా.. ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ న్యూస్ ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి రాపా సాయి ప్రశాంత్ ఐటీ దిగ్గజ కంపెనీ వర్చువల్ ఇంటర్వ్యూ కోసం తన స్నేహితుడిని పంపినట్లు తేలడంతో మోసం నేరం కింద ఇప్పుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే ఇన్ఫోసిస్ సిబ్బంది అప్రమత్తంగా లేకుంటే మాత్రం అతని ప్లాన్ సూపర్ హిట్ అయ్యి ఉండేది, ఎందుకంటే కంపెనీ అతను ఉద్యోగంలో చేరిన రెండు వారాలకే ఏదో తప్పు జరిగిందని అనుమానించడం ప్రారంభించింది. దింతో అసలు మ్యాటర్ బయటికి వచ్చింది.

తక్కువ టైంలోనే దొరికిపోయిన సాయి ప్రశాంత్: ఇన్ఫోసిస్‌కు రిసీరుట్మెంట్ సొల్యూషన్స్ అందించే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌లో అకౌంట్స్ మేనేజర్ కిషోర్ చేసిన పోలీసు కంప్లెయింట్ ప్రకారం, సాయి ప్రశాంత్ ఒక పోర్టల్ ద్వారా కంపెనీ ఉద్యోగానికి అప్లయ్ చేసుకుని తన రెజ్యూమ్‌ను పంపించాడు. కిషోర్ అతని అర్హతలను వెరిఫై చేసి, తన మేనేజర్ శివ ప్రకాష్ ద్వారా ఇన్ఫోసిస్‌కు రెస్యూమ్ పంపగా, ఆ తర్వాత ఇన్ఫోసిస్ వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించింది, కానీ స్క్రీన్ మీదకు వచ్చింది ప్రశాంత్ కాదని, అతని తరపున తన స్నేహితుడిని ఇంటర్వ్యూకు హాజరు అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడని తరువాత ఆరోపించారు. ఆ సమయంలో ఈ ప్లాన్ పనిచేసింది, తరువాత సాయి ప్రశాంత్‌కి 20 జనవరి 2025న ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. చివరకు వెంటనే కంపెనీలో చేరాడు. కానీ అసలు సిన్ అక్కడే మొదలైంది.
సిబ్బందికి పెరిగిన అనుమానం: ప్రశాంత్ పర్ఫార్మెన్స్ లేదా అతని కమ్యూనికేషన్స్ ఇంకా ఇంగ్లీష్'లో సరిగ్గా మాట్లాడలేకపోవడం చూసి ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. "ప్రశాంత్ చదువులో మంచివాడు, కానీ కమ్యూనికేషన్‌లో చాల వీక్. అందుకే అతను చాలా కంపెనీలలో ఇంటర్వ్యూలను క్లియర్ చేయలేకపోయాడు, దింతో అతను వర్చువల్ ఇంటర్వ్యూకు అటెండ్ కావడానికి తన స్నేహితుడి సహాయం తీసుకోవాలని అనుకున్నాడు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
కంపెనీ అతని ఇంటర్వ్యూ సమాధానాలు స్పష్టంగా ఇంకా నమ్మకంగా ఉన్నాయని తెలిపింది. కానీ అతను ఉద్యోగంలో చేరాక, ఇంటర్వ్యూలో ఎలా వ్యవహరించాడో దానికి పూర్తిగా వేరేలా ఉన్నాడు. ఈ తేడా కారణంగా కంపెనీ సిబ్బంది ఇంటర్వ్యూ చేసిన స్క్రీన్‌షాట్‌లను సాయి ప్రశాంత్ ఫోటోతో క్రాస్ చెక్ చేసింది. దింతో వాళ్ళు అనుమానించిన విషయం కన్ఫర్మ్ అయ్యింది, ఇంటర్వ్యూలో ఉన్న వ్యక్తి అలాగే కంపెనీలో చేరిన వ్యక్తి ఒకరు కాదు అని. సాయి ప్రశాంత్ అసలు విషయం బయటపడ్డాక అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత అతను హైదరాబాదుకు పారిపోయాడని, ఇంకా కంపెనీని మోసం చేసింది కాకుండా అతను పనిచేసిన 15 రోజులకు జీతం ఇవ్వాలని కూడా పట్టుబట్టాడు అని సిబ్బంది తెలిపారు.
సాయి ప్రశాంత్ తెలంగాణకు చెందినవాడని, అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడని సమాచారం ఇస్తూ, మేము అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అని పోలీస్ అధికారిలు చెబుతున్నారు. ఈ మోసానికి సంబంధించి ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద BNS సెక్షన్లు 318 (మోసం), 319 (వ్యక్తిత్వం ద్వారా మోసం) కింద అతని పై కేసు నమోదు అయ్యింది. ఈ సంఘటన అలాగే మోసంకి సంబంధించి పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొంటూ కంపెనీ సిబ్బంది మాట్లాడటానికి నిరాకరించారు.
'డ్రాగన్' సినిమా గురించి: ఈ కేసు తమిళ సినిమా డ్రాగన్ స్టోరీని తలపిస్తుంది, దీనిలో హీరో (ప్రదీప్ రంగనాథన్) తన స్నేహితుడిని తన తరపున ఒక హైటెక్ స్టార్టప్‌లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని అడుగుతాడు, ఎందుకంటే అతను కాలేజీ పరీక్షలలో చాల సజెక్టుల్లో ఫెయిల్ అవుతాడు ఇంకా సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి అనర్హుడు కూడా.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications