rapido: బెంగళూరు టెక్కీకి వింత అనుభవం.. పొరుగువారెవరో తెలియడంతో షాక్
rapido: మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ అలవాటుపడుతున్నారు. ఎంతగా అంటే కనీసం పొరుగింటి వారు ఎవరో కూడా తెలియనంతగా. పట్టణాలు, నగరాల్లో ఈ తరహా వ్యవహారం దాదాపు కామన్ అయిపోయింది. ఇదే సందర్భంగా బెంగళూరులో ఓ టెక్కీకి ఎదురైన అనుభవాన్ని తన లింక్డ్ ఇన్ లో పంచుకోగా.. ఇప్పుడది వైరల్ అవుతోంది.
ఆకాష్ లాల్ బాతే అనే లింక్డ్‌ఇన్ వినియోగదారుడు తన పొరుగింటి వ్యక్తితో జరిగిన ఓ ఫన్నీ సన్నివేశాన్ని వివరించారు. దాని ప్రకారం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా బెంగళారులో పనిచేస్తున్న తనకు.. నిచ్చెన కావాలని ఒకరు వాట్సాప్ గ్రూపులో రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. అది పంపిన వారి వాట్సాప్ స్టేటస్ చూడగా రాపిడో అని ఉన్నట్లు తెలిపారు. ఆయన ప్రొఫైల్ పిక్ చూసి ప్రైవేట్ గా మెసేజ్ చేయాలి అనిపించినట్లు వెల్లడించారు.

మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు అంటూ పొరుగింటి వ్యక్తికి మెసేజ్ చేసినట్లు బాతే చెప్పారు. అందుకాయన AC అమర్చడానికి నిచ్చెన కావాలని అభ్యర్థించారట. ఫొటోగ్రఫీ ఫీల్డ్ లో ఏమైనా ఉన్నారా అని అడగ్గా.. ఫొటోగ్రఫీ, పోడ్ కాస్టింగ్ వంటివి చేయడం ఇష్టం లేదని ఆయన రిప్లై ఇచ్చినట్లు తెలిపారు.
అనంతరం వాట్సాప్ స్టేటస్ గురించి ప్రశ్నించానని బాతే వెల్లడించారు. అయితే రాపిడోతో కూడిన స్టేటస్, DPల గురించి ప్రశ్నించినట్లు వివరించారు. ఇదే సమయంలో ఆ వ్యక్తి పేరుని గూగుల్ లో సెర్చ్ చేసినట్లు చెప్పారు. అప్పటికి గానీ ఎదుటి వ్యక్తి రాపిడో వ్యవస్థాపకులలో ఒకరు అని తెలిసినట్లు తెలిపారు. ఆశ్చర్యలో మునిగిపోయిన తనకు ఈలోపు ఆయన నుంచి సైతం అదే సమాధానం వచ్చిందన్నారు.


Click it and Unblock the Notifications