4 నెలల్లో 27 ఇంటర్వ్యూలు ఫెయిల్, 1800 కంపెనీలు రిజెక్ట్.. చివరకు రూ. 14 లక్షల జీతంతో జాబ్..
ఉద్యోగాన్ని పొందడం అంత సులభమేమి కాదు. ఇందులో ఎంతో కష్టపడాలి, ఎన్నో నిరాశలను అధిగమించాలి. ఇప్పుడు ఏఐ రాకతో ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలనే స్థితికి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కంపెనీలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి.ఇందులో భాగంగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. వారికిచ్చే జీతాల మొత్తాన్ని ఏఐ మీద పెట్టుబడులుగా పెడుతున్నాయి.
తాజాగా ఓ టెక్ ఉద్యోగి కథ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ కథ ఆ టెక్నీషియన్ జీవితాన్ని మార్చింది. ఈ వ్యక్తి వివరించిన వివరాల ప్రకారం.. గత నాలుగు నెలల్లో అతను సుమారు 1,800 ఉద్యోగ దరఖాస్తులను సమర్పించాడు. అయితే అప్లై చేసిన ప్రతి చోటా అతినికి నిరాశే ఎదురయింది. ఇక వాటితో పాటుగా 27 ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. మొదటి రౌండ్లలో కొన్ని వెంటనే ఫెయిల్ అయ్యాయి. మరికొన్ని తక్కువ అవకాశాలతో కూడిన దీర్ఘమైన శ్రమతో కూడిన దశల తర్వాత తిరస్కరణ వచ్చినాయి.అతను మొత్తం 1800 కంపెనీలకు ఉద్యోగం కోసం అప్లై చేయగా అవన్నీ రిజెక్ట్ అయ్యాయి. అలాగే 27 కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళితే అక్కడా ఫెయిల్ అయ్యాడు.

ఈ ప్రయాణంలో అతనికి తీవ్రమైన నిరాశ, స్వీయ సందేహాలు ఎదురయ్యాయి. అందరూ తమ ఉద్యోగ ఆఫర్లను సోషల్ మీడియాలో ప్రకటిస్తుంటే.. అతని ఇన్‌బాక్స్ మాత్రం ఉద్యోగ తిరస్కరణలతో నిండిపోయింది. అయితే ఇలాంటి సమయంలో చాలామంది నిరాశకు లోనవుతుంటారు. డిప్రెషన్ లోకి వెళుతుంటారు. అయితే అతను మాత్రం అలా అనుకోలేదు. తన ప్రయాణం ఆపకుండా ప్రయత్నం కొనసాగించాడు.
జపాన్‌లో విదేశీ ఉద్యోగ అవకాశాలను కూడా ప్రయత్నిస్తూ.. 20 LPA నుండి 85 LPA వరకు జీతాల బ్రాకెట్లలో ఉద్యోగాలు కోసం పోటీ పడతూనే ఉన్నాడు. చిన్న తప్పుల వల్ల కొన్ని అవకాశం కోల్పోయినా.. వాటిలో పాఠాలు నేర్చుకుంటూ అతను ఒత్తిడిని జయించి ముందుకు వెళ్లడం కొనసాగించాడు. చివరికి ఎట్టకేలకు అతను ఉద్యోగ వేటలో విజయం సాధించాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 75 మందితో కూడిన గ్లోబల్ స్టార్టప్‌లో రిమోట్ డెవ్‌ఆప్స్ (DevOps) ఉద్యోగాన్ని పొందాడు. అనేక ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, మొదట 8 LPA జీతంతో ఆఫర్ వచ్చింది. ఇది అతని అంచనాలకు తక్కువగా ఉంది. కానీ Techie కంపెనీతో గౌరవంగా చర్చలు జరపడంతో కంపెనీ 12 LPA ఆఫర్ చేసింది. అంతేకాక అతను మరింత ధైర్యంగా 14 LPA డిమాండ్ చేశాడు. చివరికి కంపెనీ ఈ డిమాండ్‌ను అంగీకరించి.. అతనికి 14 LPA జీతంతో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది.
ఈ విజయం అతనికి ఉపశమనం మాత్రమే కాక ఆత్మవిశ్వాసాన్ని కూడా తెచ్చిపెట్టింది. చిన్న కాలేజీ నుంచి కేవలం రెండు సంవత్సరాల అనుభవంతో అతను Tier-3 కళాశాల విద్యార్థిగా ఈ స్థాయిలోకి ఎదిగాడు. పెద్ద సంస్థలలో అవకాశాలు కోల్పోయినా, పట్టుదలతో కూడిన అతని పోరాటం చివరికి సక్సెస్‌గా ముగిసింది. ఈ కథ ప్రతి ఒక్కరికీ ఏం చెబుతుందంటే.. నిరాశను ఎదుర్కొని, ఓర్పుతో ముందుకు సాగితే విజయాన్ని అందుకోవచ్చు. ఈ టెకీ కథ, ఉద్యోగాలు కోసం పోరాటంలో ఉన్న ప్రతి యువకుడికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications